Orange Juice: ప్రతి రోజూ ఆరెంజ్ జ్యూస్(Orange Juice) తాగడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని డాక్టర్లు తెలియ చేస్తు ఉన్నారు. మెయిన్ గా నారింజ పండ్లలో ముఖ్యమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ (Vitamins, antioxidants, fiber) సహా మరిన్ని పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అందుకోసమే ఆరెంజ్ జ్యూస్‍ను రెగ్యులర్‌గా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. ఈ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏమిటంటే..
ఆరెంజ్ జ్యూస్‍లో విటమిన్ సీ (Vitamin C)పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సీ రోగనిరోధక శక్తిని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే శ్వాసకోశ ఇబ్బందులను కూడా తగ్గించగలదు. ఇన్‍ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే వానాకాలంలో ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం మంచిదనని డాక్టర్లు తెలుపుతున్నారు. నారింజ జ్యూస్‍లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. అలాగే కణాలను ర్యాడికల్ డ్యామేజ్ నుంచి ఇవి సంరక్షిస్తాయి. గుండె వ్యాధులు లాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే సమస్యలను కూడా నారింజ తగ్గించగలదు.
ఇక ఆరెంజ్‌లో పొటాషియం, ఫోలేట్ అధిక పరిమాణంలో ఉంటాయి కనుక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు ఆనుతున్నారు. దీంతో పాటు గుండె సమస్యల (Heart problems) నుంచి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఆరెంజ్ రసంలో ఫ్లేవోన్స్ అధికంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరచగలవు. జ్ఞాపకశక్తిని కూడా మెరుగు పలచగలడు.
ఆరెంజ్ జ్యూస్‌లో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీంతో పాటు చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు కూడా చాల సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం కూడా మెరిసేలా అందంగా ఉండేందుకు సహాయ పడుతుంది.
ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే అధిక ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియను (digestion) ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయ పడుతుంది,దీనితో మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆరెంజ్ జ్యూస్ తాగడం వాళ్ళ పొట్ట నొప్పుల (Stomach aches) నుంచి విముక్తి కలుగుతుంది.