Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

No confidence motion on NDA.. The discussion starts today ఎన్డీఏ పై అవిశ్వాస తీర్మానం.. నేడే చర్చ ఆరంభం

ఎన్డీఏ పై అవిశ్వాస తీర్మానం.. నేడే చర్చ ఆరంభం

 

ప్రజా దీవెన / న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతి ముఖ్యమైన, తీవ్ర చర్చకు దారి తీసిన కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం(Motion of no confidence) కోసం సమయం ఆసన్నమైంది. ఇలాంటి అసలుసిసలైన అవిశ్వాస ఘట్టం కోసం పార్లమెంట్ సర్వం సిద్ధమైంది. ఎన్​డీఏ సర్కారుపై (nda government) ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజే చర్చ ఆరంభం కానుంది.మణిపుర్ హింసపై ( On violence in Manipur) పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలో అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi) ఆ పార్టీ తరఫున చర్చను ప్రారంభించనున్నారు. బుధ, గురు వారాల్లోనూ రెండు రోజులపాటు అవిశ్వాస తీర్మానంపై లోక్​సభలో తీవ్రచర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టింది. గతవారం దీన్ని స్పీకర్ ఓంబిర్లా(om birla) ఆమోదించిన నేపథ్యంలో మణిపుర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ దీనిపై మాట్లాడాలని పట్టుపడుతున్న లాభం లేకపోవడంతో ముక్తకంఠంతో అసంతృప్తి (Dissatisfaction with open arms)  వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.  బలాబలాల ఆధారంగా స్పీకర్ ఆయా పార్టీల సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు. అధికార పార్టీ ఎంపీలు(mp) మాట్లాడిన తర్వాత విపక్ష సభ్యులకు సమయం కేటాయించే అవకాశం ఉంది.