— రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదు
Earthquake: ప్రజా దీవెన, జపాన్: జపాన్‌లో భారీ భూకంపం (Huge earthquake in Japan) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకం పం నమోదు కావడంతో జపాన్ భయాందోళనలకు గురైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది. దీని ధాటికి పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయి, ఒక్కసా రి గా ప్రజలు భయాందోళన చెందా రు. ఇళ్లు, ఆఫీసుల (Houses and offices) నుంచి బయట కు పరుగులు తీశారు. ఈ ఘటన లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధిం చిన వివరాలు ఇంకా తెలియరాలే దు.భారీ భూకంపం సంభవించడం తో జపాన్‌లోని వివిధ ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మియాజాకి, కగోషి మా, ఎహిమ్ ప్రిఫెక్చర్, కొచ్చి, ఓయి టా (Miyazaki, Kagoshi Ma, Ehime Prefecture, Kochi, Oi Ta) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మియాజాకి ప్రిఫెక్చ ర్‌లో 20 సెంటీమీటర్ల ఎత్తు మేర సముద్రపు అలలు ఎగిసిపడుతు న్నాయి. 7.1 తీవ్రత భూకంపం పరిణామాలను అధికారులు అం చనా వేస్తున్నారు.