Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu Naidu: సుదీర్ఘంగా టిడిపి పోలిట్ బ్యూరో

–పార్టీ, రాష్ట్రం రెండు కళ్ళుగా విస్తృత చర్చలు
–నామినేటెడ్ పదవులు, విశాఖ స్థానిక సంస్థల అభ్యర్థి పై కూడా చర్చ

Chandrababu Naidu: ప్రజా దీవెన, అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో పార్టీ సమావేశం గురువారం మంగళగిరిలోని ఎన్టీఆ ర్ భవన్‌లో జరిగింది. ఈ సమా వేశంలో మంత్రులు, ఎమ్మె ల్యేలు, టీడీపీ నేతలకు (Ministers, MM Lyell, TDP leaders) చంద్రబాబు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. రెండున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. నామినేటె డ్ పదవులపై చంద్రబాబు చర్చించా రు. వీలైనంత త్వరగా పార్టీ సభ్య త్వ నమోదు కార్యక్రమం ప్రారంభిం చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోం ది.

పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ… పొలిట్ బ్యూరో (Polit Bureau)సమవేశం లో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకు మంత్రి అచ్చెన్నాయు డు వెల్లడించారు. ‘‘దక్షిణ భారతదే శంలో జనాభా నిష్పత్తి రోజురోజు కూ తగ్గుతుంది. జనాభా నిష్పత్తి తగ్గడంతో కేంద్రం నుంచి వచ్చే నిధు లు సైతం తగ్గుతాయి. తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలి. పార్టీ సభ్యత్వ రుసుం రూ.100లతో ప్రారంభిస్తాం. సభ్య త్వం తీసుకున్న వారు ప్రమాదవ శాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చే విధంగా పరిహా రం ఇవ్వాలని నిర్ణయించారు. పేదరి క నిర్మూలనపై ప్రధానంగా చంద్రబా బు చర్చించారు. త్వరలో పేదరిక నిర్మూలనపై విధివిధానాలు రూపొం దిస్తాం. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ వర్గీకరణకు జిల్లాను యూనిట్‌ గా (Unit) తీసుకుంటాం.

జన్మభుమి కార్య క్రమాలు (Janmabhumi Karya Krama) తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. జన్మ భూమి2 గా ఈ కార్యక్రమానికి నామకరణం చేయాలని భావిం చారు. మొన్నటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సరిగ్గా దృష్టి పెడితే వైసీపీ గెలిచిన సీట్లలో మరో నాలుగు నుంచి ఐదు సీట్లు టీడీపీ గెలిచేది’’ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.పొలిట్ బ్యూరోలో ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 55 రోజుల పాలనపై అధినేత చంద్రబాబు చర్చించారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘త్వరలో జన్మభూ మి2 ప్రారంభం కాబోతుంది. జన్మ భూమి -2 (Janma Bhoomi -2) కార్యక్రమాన్ని విజయ వంతం చేయడానికి ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. వర్షాలతో ప్రాజెక్టులన్ని నిండుకుండలా ఉన్నాయి. ప్రాజె క్టులు నిండటంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుండె నీరు కారుతోంది. నామినేటె డ్ పోస్టులను అతి త్వరలో భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చా రు. ఇసుకలో అక్రమాలు సహించ బోనని అధినేత మరోసారి హెచ్చరిం చారు జనాభా నియంత్రణతో డీలి మిటేషన్‌లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోంది. ఒక యూపీలో 140 పార్లమెంటు స్థానా లు వస్తే దక్షిణ భారతదే శంలో160 మాత్రమే ఉంటాయి. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే దానిపై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లా డారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ తొలి పొలిట్ బ్యూరో సమా వేశం ఇది. ఈ భేటీకి మంత్రులు నా రా లోకేష్, కొల్లు రవీంద్ర, అచ్చె న్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, యనమల రామ కృష్ణుడు, నిమ్మకాయల చినరా జప్ప, బొండా ఉమామహేశ్వర రావు, పల్లా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు తదితరులు హాజర య్యారు. ఈ భేటీలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.