–ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
–మీడియా సమావేశంలోఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడి
Sarath Chandrapawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలోని రైతుల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మ ర్లను (Farmers agricultural transformers) ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్ కాయిల్స్, ఆయిల్ దొంగతనాలకు పాల్ప డుతున్న ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను వాడపల్లి పోలీ సులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sarath Chandrapawar)గురవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచి వివ రాలను వెల్లడించారు. ఏపీ పిడు గురాళ్లకు చెందిన మెగవత్ రంగ నాయక్, అతని కుటుంబానికే చెంది న సింగరాయపాలెంకు చెందిన జటావత్ ఇమామ్ నాయక్.
జటావత్ మౌలనా నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, చందంపేట (Jatawat Maulana Naik, Sheikh Jatawat Wali Naik, Chandampet) యల్మలమందకు చెందిన కేతవత్ సునిల్ గత కొన్ని రోజులుగా రైతుల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ల దోపిడి లక్ష్యంగా పెట్టుకొని పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనాలకు పాల్పడుతు న్నారు. నల్గొండ జిల్లాలోని వాడ పల్లి, అడవిదేవులపల్లి, మిర్యా లగూడ, వేములపల్లి, త్రిపురారం, నిడమా నూర్, తిప్పర్తి, నల్గొండ, నకిరేకల్, చిట్యాల పోలీస్ స్టేషన్ ల పరిధిలోని వ్యవసాయ పొలాల వద్ద రైతుల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మ ర్లను ధ్వంసం చేసి అందులో గల కాపర్ కాయిల్స్, అయిల్ ను దొంగిలించి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వారి కారులో హైదరాబాద్ లోని తమకు తెలిసిన మూడవత్ సుజాత, నరేశ్ కు చెందిన పాత ఇనుము వ్యాపా రస్తులకు తక్కువ ధరకు అమ్ముతు అక్రమంగా సొమ్ము చేసుకునేవారు. వారిని మిర్యాలగూడ డీఎస్పీ రాజ శేఖర్ రాజు (Miryalaguda DSP Raja Shekhar Raju), రూరల్ సీఐ కే. వీర బాబు, వాడపల్లి ఎస్ఐ రవి, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్, సిబ్బంది నిఘా వేసి పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ. 9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలి పారు. ప్రస్తుతం కొనుగోలుదారులు ఇద్దరు పరా రీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. వారిపై 34కేసులు నమోదై ఉన్నాయని, వారిని కోర్టుకు రిమాండ్ చేస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.