బడుగు, బలహీన వర్గాలకు చేయూత
—బుసిరెడ్డి పౌండేషన్ చైర్మెన్ పాండురంగారెడ్డి
ప్రజా దీవెన/నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు, గిరిజనులకు, వికలాంగులకు, అనాధలకు, వ్రృద్దులకు ఆసరాగా ఉండేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని బుసిరెడ్డి పౌండేషన్ చైర్మెన్ పాండురంగారెడ్డి తెలిపారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమానూరుమండలంలోని పార్వతిపురం, బాలాపురం, మార్లగడ్డ, మార్లగడ్డ తండ,వడ్డెర గూడెం,కుంటిగొర్ల గూడెం, వల్లభాపురం,కక్కాయిగూడెం, కక్కాయిగూడెం క్యాంపు, నారమ్మ గూడెం, రేగుల గడ్డ గ్రామాలలో 30మంది నిరుపేద కుటుంబాలకు రూ. 5వేలు చొప్పున ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మరీ అందజేశారు.
ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మునుముందు కూడా పౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి, నిడమానూరు మండలం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ యంపిపి అంకితి వెంకట రమణ, సర్పంచులు వంకా బ్రహ్మన్న,విజయ్,మహేష్,రవి, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి,జంగిలి రాములు,నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, గేమ్యానాయక్ తండా సర్పంచ్ నరేష్ నాయక్, చింతపల్లి సర్పంచ్ ప్రభావతి సంజీవరెడ్డి,తిరుమలగిరి సర్పంచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి,ఉప సర్పంచ్ లు వెంకన్న ,గొడితి శ్రీను, యాదగిరి,గంగుల సరిత పాపయ్య, కోటిరెడ్డి,ప్రదీప్ రెడ్డి, తిరుమలనాధ చైర్మన్ బుర్రి రామిరెడ్డి,మాజీ కోఆపరిటివ్ నాగెండ్ల క్రృష్ణారెడ్డి, కుంభం శ్రీకాంత్ రెడ్డి, లక్కీ ఫుడ్ కోర్ట్ భాస్కర్ రెడ్డి,శివానంద రెడ్డి, వెంకట్రామిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకన్న యాదవ్, వాడపల్లి శ్రీను ముదిరాజ్,సైదాచారి,నాగార్జున రెడ్డి,అనుముల కోటేష్,రమేష్ చారి,లింగస్వామి, షేక్ ముస్తఫా, లక్కిపుడ్ కోర్ట్ భాస్కర్ రెడ్డి,వెంకన్న యాదవ్,మట్టారెడ్డి,జయంత్ రెడ్డి,గంగయ్య, అబ్దుల్ కరీం, భవాని రెస్టారెంట్ సైదాచారి, శ్రీకాంత్ రెడ్డి,ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.