Maheshwaram Venkanna:ప్రజా దీవెన, శాలిగౌరారం: బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల (BRS party MLAs)బృందం గత నెల 26 న మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda project) సంర్శన కు వెళ్లిన సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మాజీ ఎమ్మె ల్యేలు బాల్క సుమన్,గండ్ర వెంకట రమణారెడ్డి (Balka Suman, Gandra Venkata Ramana Reddy) ల పై ఇరిగేషన్ శాఖ అధికారులు డ్రోన్ కెమెరా ప్రాజెక్టు పై ఎగరవేశారు అన్న నెపంతో కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభా గం మండల అధ్యక్షులు మహేశ్వరం వెంకన్న అన్నారు. అయన గురువారం శాలిగౌరారం లో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ తక్షణమే కేసులు ఉపసహరించుకోవాలని అధికారు లను డిమాండ్ చేశారు.
రాజకీయ కుట్రలో భాగంగానే రేవంత్ ప్రభు త్వం (Revanth government) కేసు పెట్టిందని ఈ కేసులకు అధికారులు వంత పాడుతున్నా రని,తక్షణమే కేసులు ఉపసహ రించుకోవాలని కోరుతున్నామని ప్రాజెక్టులు కట్టడం కాపాడుకోవడం నీళ్లు నింపడం సాగును పెంచుకోవ డం తెలియదు కానీ అక్రమ కేసులు పెట్టడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆత్రుత పడుతుందని అన్నా రు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రాజె క్టుల్లో నీళ్లు నిలువ ఉంచి సాగు ద్వారా సస్యశ్యామలం చేయవచ్చ ని అటువంటి ఆలోచన చేయకుం డా ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది కూలిపోతుంది గడిచిన 10 సంవ త్సరాలుగా అధికారంలో లేము మాకు ఆకలవుతుంది అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం (Congress Party Govt)వ్యవహ రిస్తుందిని రైతులను మోసం చేసాం చేసే మోసపూరిత విధానాలకు కాం గ్రెస్ పార్టీ స్వస్తి రైతన్న ను ఆదు కోవాలని డిమాండ్ చేశారు.