Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagan Mohan Reddy: రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన

–గ్రామాల్లో ఆధిపత్యం కోసం వ్యవ స్థలను భ్రష్టు పట్టిస్తున్నారు
— ఏపీలో చంద్రబాబు అరాచక పాలన సృష్టిస్తున్నారు
— ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

Jagan Mohan Reddy: ప్రజా దీవెన, నంద్యాల: రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన (Red Book regime) కొనసాగుతోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపించారు. రాష్ట్రవ్యా ప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నా రని, ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్య వస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. రాళ్లు రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడు లు చేస్తున్నారని, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వా నికి లేనేలేదని, రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతుందోనని చంద్ర బా బు మహిళలను మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల సమయం లో మాయ మాటలు చెప్పారు. మన ప్రభుత్వ మే ఉండి ఉంటే ఇప్ప టికే అందరికి రైతు భరోసా అందేదని వైఎస్ జగన్ అన్నారు.

నంద్యాల జిల్లా సీతారామాపురంలో మృతి చెందిన వైఎ స్సార్‌సీపీ (Worker of YSRCP) కార్య కర్త సుబ్బారాయు డి కుటుంబాన్ని పరామర్శించేందు కు వెళ్లారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం లో అరాచక పాలన జరుగు తోంద ని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లను అడుగుతారే మోనని సీఎం చంద్ర బాబు భయానక వాతావ రణo కల్పిస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికి టీడీపీ వాళ్ల ను పంపించి అనేక హామీలు ఇస్తా మని చెప్పించారని, కానీ అధికారం లోకి రాగానే మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అధికారం లో ఉండుంటే ప్రతి రైతుకు సొమ్ము అందేదని, అందరికీ సంక్షేమ పథ కాలు అందేవని పేర్కొన్నారు. గ్రా మాల్లో ఆధిపత్యం కోసం దాడులు చేస్తూ లా అండ్ ఆర్డర్ (Law and order) సమస్య సృష్టిస్తున్నారని సీతారామాపురం లో సుబ్బరాయుడు కుటుంబ స భ్యులు పోలింగ్ బూత్‌లో ఏజెం టుగా కూర్చున్నాడని, అతడిని దారుణంగా హత్య చేశారని ఆరో పణలు చేశారు.

ఈ ఘటనతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (Law and order) ఉందా అని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. నారపురెడ్డి అనే వ్యక్తి ఎస్సైకి ఫోన్ చేసినా పోలీసు లు సకాలంలో స్పందించ లేదని, కొంతసేపటికి ఎస్సై ఊరికి వచ్చినా పైఅధికారులకు ఫోన్లు చేస్తూ ప్రేక్షక పాత్ర పోషించారని నిందలు వేశా రు. నారపురెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసినా పోలీసులు అదనపు బలగా లను పంపలేదని అన్నారు. ఎమ్మె ల్యే బుడ్డారెడ్డి (MLA Buddha Reddy)హత్యారాజ కీయాల ను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. సుబ్బరాయుడుని హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే ఎందుకు అరెస్టు చేయలే దని జగన్ ప్రశ్నించారు.

నిందితుల కాల్ డేటా (Call data)బయటకు తీస్తే అసలు వ్యక్తులు వెలుగులోకి వస్తారని, కేవలం మర్డర్ చేసిన వారిపైనే కాదు, హత్య చేయించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. సీతారా మాపురంలో హత్యకు గురైన సు బ్బారాయుడు కుటుంబానికి అండ గా ఉంటానని, నిందితులకు కఠిన శిక్ష పడేంత వరకు న్యాయ పోరా టం చేస్తానని అన్నారు. ఇక సుబ్బ రాయుడు కుటుంబానికి ప్రాణ రక్ష ణ కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు. ఇక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హత్యా రాజకీయా లను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపణ లు గుప్పించారు. మండలానికి ఇద్ద రిని చంపాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (Buddha Rajasekhar Reddy)మీటింగ్‌లో చెప్పా రని, ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోందని మాజీ సీఎం అన్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయ లేదని ఆయన ప్రశ్నించారు.