United movements against Agraq reservation అగ్రకుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు
-- రాజ్యాధికారమే అంతిమబాట నినాదంతో ముందుకుపోదాం -- అగ్రకుల పాలక పార్టీలు తమ కులాలకు ఆర్ధిక రిజర్వేషన్లు ఇచ్చుకోవడం దుర్మార్గం -- నాగార్జునసాగర్ నియోజకవర్గ సమావేశంలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు ఈరటి బాలరాజు యాదవ్
అగ్రకుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు
— రాజ్యాధికారమే అంతిమబాట నినాదంతో ముందుకుపోదాం
— అగ్రకుల పాలక పార్టీలు తమ కులాలకు ఆర్ధిక రిజర్వేషన్లు ఇచ్చుకోవడం దుర్మార్గం
— నాగార్జునసాగర్ నియోజకవర్గ సమావేశంలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు ఈరటి బాలరాజు యాదవ్
ప్రజా దీవెన/నాగార్జున సాగర్: సీట్లవాటా, ఆర్ధిక వాటా, రాజ్యాధికారమే అంతిమబాట నినాదంతో యాదవ విద్యావంతుల వేదిక, యాదవ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆగస్టు 13 న నిర్వహించాలనుకున్న యాదవ యుద్ధభేరి సభను ఆగస్టు 25 కి వాయిదా వేసినట్లు యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఈరటి బాలరాజు యాదవ్ తెలిపారు.బుధవారం నాగార్జునసాగర్ నియోజకవర్గకేంద్రం అనుములలో జరిగిన నియోజకవర్గస్థాయి విద్యావంతుల వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు.
బి.పి. మండల్ 105 జయంతిని పురస్కరించుకుని యాదవ యుద్ధభేరి సభను ఆగస్టు 25 న జరపాలని రాష్ట్ర యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, యాదవసంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించిందని తెలిపారు.బీసీల రిజర్వేషన్ల ప్రదాత బి.పి. మండల్ కమిషన్ చేసిన 40 సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాన సిఫారసు అయినటువంటి కులగణను వెంటనే చేపట్టాలన్నారు. జంతు గణన చేపట్టి ప్రకటించే ప్రభుత్వాలకు కులగణన చేపట్టడానికి మాత్రం చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వని అగ్రకుల పాలక పార్టీలు తమ కులాలకు ఆర్ధిక రిజర్వేషన్లు ఇచ్చుకోవడం దుర్మార్గం అన్నారు. అణగారిన కులాల విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్ధిక, సామాజిక అభివృద్ధిని తెగనరకడానికొచ్చిన రామబాణమే అగ్రకుల రిజర్వేషన్లన్నారు.
మా యాదవ, బి.సి పిల్లల భవిష్యత్తును ఆగంజేసే అగ్రకుల రిజర్వేషన్లను ఈ ద్రవిడ నేల సహించబోదన్నారు. ఎస్.సి, ఎస్టీ లను కలుపుకుని బీసీలు అగ్రకుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు యాదవ విద్యావంతుల వేదిక కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 3 లోకసభ, 2 రాజ్యసభ సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆగస్టు 25 న యుద్ధభేరి సభను నాగోల్ ప్రాంతంలోని అమరజీవి చింతల లక్ష్మణ్ రావు యాదవ్ ప్రాంగణంలో అతిపెద్ద బహిరంగసభ నిర్వహిస్తున్నామన్నారు.
విద్యావంతుల వేదిక నియోజకవర్గ అధ్యక్షులు నడ్డి బాలరాజు యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశం యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఎల్వీ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుదొడ్డి రాహుల్ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా మీడియా ఇంచార్జ్ మామిడి దుర్గాప్రసాద్ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గుండెబోయిన జానయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కడారి యాదయ్య యాదవ్, మంగదుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు బూడిద గోవిందు యాదవ్, జెల్లల సత్యం యాదవ్, బొల్లిగోర్ల ఎల్లయ్య, పసుల శ్రీకాంత్, పిల్లి వెంకట్, పెద్దిరాజు యాదవ్, వీరబోయిన మల్లిఖార్జున్ యాదవ్, సాగర్ యాదవ్, మధు యాదవ్, లక్ష్మణ్ యాదవ్, అల్లి లోకేష్ యాదవ్, జానపాటి కోటేష్ యాదవ్, జవ్వాజి బిక్షం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.