*కోదాడలో విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
Multi Specialty Hospital: ప్రజాదీవెన , కోదాడ: పేదలకు మెరుగైన వైద్య సేవలు (Better medical services) తక్కువ ధరలకు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం అభయాంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (Multi Specialty Hospital) ను అమె ప్రారంభించి మాట్లాడారు. కోదాడ ప్రాంత ప్రజలు సుదూర నగరాలకు వెళ్లకుండా కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తేస్తున్న కోదాడ ప్రాంత వైద్యులను అభినందించారు. ఆపద సమయంలో వ్యాపార దృక్పథంతో కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు తక్కువ ఫీజులకు అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వైద్యులను సూచించారు.
వైద్య వృత్తి (Medical profession)ఎంతో పవిత్రమైందని కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యశాల యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని. ప్రమీల,పిసిసి డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి కోదాడ ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు ఏటుకూరి రామారావు స్త్రీల ప్రముఖ వైద్యురాలు ప్రమీల శ్రీపతి రెడ్డి,,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ జానీ, అంబడికర్ర శ్రీనివాసరావు ,నల్లపాటి.శ్రీను, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.