రిక్షా కార్మికుని కొడుకు ‘ ఎస్ఐ ‘
ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండలోని శ్రీనగర్ కాలనీకి చెందిన పల్లెబోయిన వెంకయ్య లింగమ్మల కొడుకు శంకర్ యాదవ్ నిన్నటి రోజున వెలువడిన ఎస్ఐ పరీక్షా ఫలితాల్లో TSSP S.Iగా ఎంపికయ్యాడు. ఎస్సైగా ఎంపికైన శంకర్ ఆయన అనుభవాలు ఆయన మాటల్లోనే…
మాది నిరుపేద కుటుంబం మా నాన్నగారికి మేము ముగ్గురం సతానం. మా నాన్నగారు రిక్షా కార్మికుని పని చేసి మమ్మల్ని చదివించడం జరిగింది. వారి యొక్క కష్టానికి ప్రతిఫలంగా నేను మంచి స్థాయిలో ఉండాలని అహర్నిశలు కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని సాధించాను. నాకు మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటు ముఖ్యంగా మా అన్న శ్రీనివాస్ సహకారంతో S.I ఉద్యోగం సాదించానన్నారు. తన అన్న శ్రీనివాస్ ప్రకాశం బజార్ లో నిర్వహిస్తున్నటువంటి విజయ ఆప్టికల్ షాపులో పనిచేసుకుంటూ ఖాళీ సమయంలో చదువుకుంటూ ఈ ఉద్యోగం సాధించానని చెప్పాడు.
నాకు S.I ఉద్యోగం రావడంపట్ల మా కుటుంబ సభ్యులు,స్నేహితులు, సన్నిహితులు, మా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారన్నారు.