Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Duvvada Srinivas: నాలుగు గోడల మధ్య గుట్టు రచ్చ రచ్చ రాంబోల

–వైసీపీ ఎమ్మెల్యే దాష్టీకంతో హద్దు దాటిన కుటుంబ వ్యవహారం
–గుట్టు కాస్త గట్టి దాటడంతో నలు గురిలో గలాటా
–కోపతాపాలు నియంత్రించుకోలేని స్థితిలో భార్య బిడ్డలపై దాడి
— పోలీసుల ఎదుటే భార్య వాణి, కూతురుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దాడి

Duvvada Srinivas: ప్రజా దీవెన, శ్రీకాకుళం: గుట్టుగా సాగాల్సిన సంసారం రట్టయింది. అది ఎవరిదో మామూలు కుటుం బం కాదు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాస నసభలో (Andhra Pradesh Legislative Assembly)సభ్యుడైనటువంటి ఎమ్మెల్యే వ్యవహారం. నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారం కాస్తా నలుగురులో పడింది. దీంతో నాలుగు గోడల మధ్య బొట్టుగా ఉండాల్సిన వ్యవహారం రచ్చకు రచ్చకు దారి తీసింది. ఇంతకాలం గుట్టుగా సాగిన వ్యవహారం ఒక్క సారిగా బయటకు‌రావడంతో తట్టుకోలేక పోయారు. కోప తాపాలు నియంత్రించుకోలేని స్థితిలో తన స్థాయిని మర్చి నడిరోడ్డుపై నవ్వుల పాలయ్యారు. అదికూడా అర్ధరాత్రి వేళ భార్య వాణి, కూతురుపై దా డికి ప్రయత్నించాడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas). పోలీసులు అడ్డుకోవడంతో వాణి, ఆమె కూత రు అదృష్టవశాత్తు బయటపడ్డారు. ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలో మారిన వ్యవహారం కథాకమీషు… వైసీపీలో ఓ వెలుగు వెలిగిన ఎమ్మెల్యే దువ్వాడ శ్రీని వాస్ (Duvvada Srinivas) గురించి చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థిపై మండిపడుతూ మీడియా ముందు కంటతడి పెట్టి అధినేత జగన్‌ను ఆకట్టుకున్ననేత.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా దువ్వాడ (Duvvada Srinivas)విషయంలోనూ అదే జరి గింది. దీంతో దువ్వాడ శ్రీను ఫ్యామి లీలో అంతర్గత కలహాలు క్రమ క్ర మంగా చిలికి చిలికి గాలి వానలా మారింది. ఏ రోజూ బయటపడిన సందర్భాలు రాలేదు కాని మరి ఏం జరిగిందో తెలీదుగానీ దువ్వాడ శ్రీను ‘నారీ నారీ నడుమ మురారి’ ఇంటిగుట్టు బయటకువచ్చింది. తండ్రి కావాలంటూ కుమార్తెలు, భ‌ర్త తిరిగి రావాలంటూ భార్య దువ్వాడ వాణీలు వైసిపి ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ‌ద్ద గురువారం హం గామా సృష్టించారు. దీనికి కౌంట‌ర్ గా దువ్వాడ‌తో ఉంటున్న మాధురి నిన్న మీడియా స‌మావేశం పెట్టి వాణిని దుమ్మెత్తి పోశారు.. దువ్వా డ (Duvvada Srinivas) త‌న‌కు మంచి స్నేహితుడంటూ చెప్పుకొచ్చింది అత‌డితోనే తాను ఉంటునంటూ తేల్చేసింది. ఈ విష‌యం తెలుసుకున్న దువ్వాడ వాణి ఆమెతో తాడో పేడో తేల్చుకు నేందుకు శుక్రవారం రాత్రి 11 గంట ల సమయంలో అక్కవరం సమీపం లో దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas) ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో వెళ్లారు. తల్లీ కూతురు అక్కడకు వచ్చిన విష యం దువ్వాడ శ్రీను, ఆయన సోదరు డుకి తెలిసింది. అనుచరులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వస్తూ.. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తిట్ల దండకంతో బూతు పురాణం మొదలుపెట్టారు.

ఇంటి నిర్మాణానికి వినియోగించే వస్తువు సామాగ్రితో భార్య వాణి, కూతురుపై దాడికి చేయబోయాడు దువ్వాడ శ్రీను. అయితే పోలీసులు (The police) ఆమెకు వలయంగా మారారు. దువ్వాడ శ్రీనును సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు భార్య వాణి, కూతురు హైందవి బైఠాయంచారు. అస‌లు మాధురికి ఉన్న ముగ్గురు సంతానానికి డిఎన్ ఎ టెస్ట్ చేయాల‌ని, అప్ప‌డు త‌న భ‌ర్త అస‌లు స్వరూపం తెలుస్తుదంటూ వాణి కోరింది.. దీనిపై గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టినా పోలీసులు కన్వీన్స్ చేయడంతో పరిస్థితి కాస్త కూల్ అయ్యింది.ఇంటి పోరుకు సూత్ర‌ధారి వాణి గ‌త కొన్నేళ్లుగా స్థానిక వైసిపి నాయ‌కురాలు మాధురి ఎమ్మెల్సీతోనే ఉంటున్న‌ది. ఆమె ఎంట‌ర్ అయిన త‌ర్వాతే శ్రీనివాస్ కుటుంబాన్నిదూరం పెట్టాడ‌నే అరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి.. ఇదే వాస్త‌వం అంటూ దువ్వాడ భార్య, కుమార్తెలు అంటున్నారు.. అయితే దువ్వాడ కు, తనకు మధ్య ఉన్నది స్నేహ బంధమే తప్ప మరేమీ కాదని స్పష్టం చేశారు. తన భర్త మెరైన్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారని, ముగ్గురు చిన్న పిల్లలున్నారని చెప్పారు. వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డుమీదకు లాగడం సరికాదన్నారు.

దువ్వాడ శ్రీనివాస్, వాణిల (Duvvada Srinivas, Vanila) మధ్య విభేదాలుంటే వారిద్దరూ తేల్చుకోవాలని ఆమె అన్నారు. ఇటీవల ముదిరిపాకనపడ్డ గొడవలు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నుంచి దువ్వాడ శ్రీనుకు ఇంటి రగడ మొదలైంది. కాకపోతే తన టాలెంట్‌తో ఆ విషయాన్ని సెలైంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈలోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ల్లో దువ్వాడ శ్రీను భార్య వాణి పోటీ చేశారు. జెడ్పీటీసీగా గెలుపొందా రు. ఆ తర్వాత నుంచి భార్య భర్తలు మధ్య ఎడబాటు మరింత పెరిగింది.ఈ టార్చర్ తట్టుకోలేక జగన్ వద్దకు వెళ్లిన దువ్వాడ, నియోజకవర్గానికి తన భార్య వాణిని ఇన్‌ఛార్జ్ చేయా లని రిక్వెస్ట్ చేశారు. పరిస్థితి గమనించిన జగన్, అలాగే అని చెప్పి వారిని పంపించారు. అయితే అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పుడు టెక్కలి నుంచి దువ్వాడశ్రీను ప్రకటించింది ఆ పార్టీ. దీంతో భార్యభర్తల మధ్య వివాదం మరింత ముదిరింది. తారాస్థాయికి చేరి చివరకు బయటకు వచ్చింది.