–మిర్యాలగూడ నియోజకవర్గం పరి ధిలోని 5 ఎత్తిపోతలు పూర్తి చేస్తాం
–ఎత్తిపోతల పథకాల పూర్తి కి నిధు ల కొరత లేనేలేదు
–స్థానిక శాసనసభ్యులు కోరిన వా చ్యతాండ ఎత్తిపోతలతో 3 చెక్ డ్యాములు మంజూరు
–రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
Uttamkumar Reddy: ప్రజా దీవెన, మిర్యాలగూడ: రైతుల జీవితాలలో వెలుగు నింపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమా ర్ రెడ్డి (Uttamkumar Reddy) అన్నారు.ఆదివారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గం, అడవిదేవులపల్లి మండలం,చిట్యాల గ్రామం దున్న పోతుల గండి ఎత్తిపోతల పథకం సైట్ ను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ముందుగా చిట్యా ల గ్రామం , దున్నపోతుల గండి లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ (Helipad)వద్ద జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం ఇంటేక్ వెల్ ను, కృష్ణా నది నుండి దున్నపోతుల గండి ఎత్తిపో తల పథకం (Gandi Uptipo Tala Scheme) ఇంటెక్ వెల్ కు వచ్చే హలియా వాగును మంత్రి అధికా రులతో కలిసి పరిశీలించారు . అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ముం దుగా చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిర్యాలగూడ నియోజ కవర్గంలో చేపట్టనున్న దున్నపో తుల గండితో పాటు ,ఇతర ఎత్తిపో తల పథకాల పై వివరించారు. అడ విదేవుల పల్లి మండలం చిట్యాల గ్రామం వద్ద చేపట్టిన దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం కింద 12239 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 219.19 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగిందని, ఇందుకు సంబంధించి పంపు హౌస్, అప్రోచ్ కాలువల మట్టి తవ్వకం పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ ఎత్తిపోతల ద్వారా ఉల్సాయపాలెం, మొల్కచర్ల, బాల్నేపల్లి, చాంప్ల తండా, కొత్త నందికొండ, అడవిదేవులపల్లి, చిట్యాల గ్రామాల లోని 12,239 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
దామరచర్ల మండలం బోత్తలపాలెం ఎత్తిపోతల పథకం కింద 8610 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించడం జరిగిందని, ఇందుకు 259.25 కోట్ల రూపాయల పరిపాలన మంజూరు కావడం జరిగిందని, బోత్తలపాలెం ,రాజాగట్టు, దామరచర్ల, నర్సాపూర్, తాళ్ల వీరప్ప గూడెం ,కొత్తపల్లి, వాడపల్లి (Botthalapalem, Rajagattu, Damaracharla, Narsapur, Thalla Veerappa Gudem, Kottapalli, Vadapally) గ్రామాలలోని 8610 ఎకరాలకు సాగునీరు అందుతున్నదని వివరించారు. వీర్లపాలెం -2 ఎత్తిపో తల పథకం కింద 2,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను, 32.22 కోట్ల రూపాయలు పరిపాలన అనుమతి మంజూరు చేయడం జరిగిందని, వీర్లపాలెం, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి లోని 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. తోపుచర్ల ఎత్తిపోతల పథకం కింద 9 కోట్ల 30 లక్షల రూపాయల ప్రతి పాదిత వ్యయంతో 316 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభు త్వం పరిపాలన అనుమతి మంజూరు చేసిందని ,ఇందులో భాగంగా తోపుచెర్ల చిన్న చెరువు, పెద్ద చెరువు, బల్పవానికుంట, పుచ్చకాయల గూడెం, గణపతి వారి గూడెం, బొమ్మకల్ గ్రామాలకు లోని 316 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలియజేశారు.
కేశవపురం ఎత్తిపోతల పథకం ద్వారా 5875 ఎకరాలకు సాగునీరు అందించాలని, 75.9 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసిందని ,ఇందులో భాగంగా కేశవపురం, కొండరపోలు దామరచర్ల లోని 5875 ఎకరాలకు సాగునీరు అందనున్నదని ఆయన వివరించారు. మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లా డుతూ గత పది సంవ త్సరాల నుండి మిర్యాలగూడ నియోజకవ ర్గం లోని ఎత్తిపోతల పథకాల పూర్తికి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెంతనే కృష్ణా నది నీరు ఉన్నప్పటికీ, ఎలాంటి ఉపయోగం లేకుండా కిందికి తరలిపోయాయని, తనకు ఈరోజే తెలంగాణ వచ్చినంత ఆనందంగా ఉందని అన్నారు.
దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం, తోపుచర్ల, కేశవాపురం ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామని, ఇందుకు సంతోషంగా ఉందని, సంవత్సరంలోపే ఈ ఎత్తిపోతల పథకాలాన్ని పూర్తి చేయాలని ఆయన మంత్రకి విజ్ఞప్తి చేశారు .అలాగే నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువ నుండి డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి సైడ్ కెనాల్స్ పూడికతో పూడుకుపోయి ఉన్నాయని, కంపచెట్లు పెరిగిపోవడం, అక్కడక్కడ బ్రిడ్జిలు కూలిపోయి ఉన్నాయని వాటిని తక్షణమే బాగు చేయాలని ఆయన కోరారు. అంతేకాక వాచ్యతాండ -2 ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని, 3 చెక్ డ్యాములను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరం 2 పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించనున్నామని ,మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని 5 లిఫ్టులకు కావలసిన నిధులతోపాటు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ప్రధాన కాలువలతో పాటు, మైనర్ కాలువలలో పూడికతీత, చెట్ల తొలగింపు వంటి వాటికి 24 గంటల్లో నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గం 5 లిఫ్ట్ ఇరిగేషన్లకు 490 కోట్ల రూపాయలు అవసరం కాగా ,వాటిని తక్షణమే నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
వచ్చే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం (Independence Day) నాటికి ఈ 5 లిఫ్ట్ లను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను, ప్రాజెక్టు సీఈని ఆయన ఆదేశించారు. లిఫ్ట్ ఇరిగేషన్ల కు ఎలాంటి నిధుల కొరతలేదని, వేగవంతంగా పనులు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం, తోపుచర్ల, కేశవపురం లిఫ్ట్ ల ద్వారా లబ్ధి పొందనున్న గ్రామాల గురించి వివరించారు .అంతేకాక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరిన వాచ్యతాండ రెండవ లిఫ్టును మంజూరు చేస్తామని, అలాగే మూడు చెక్ డ్యాములను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల జీవితాలలో వెలుగు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు బాగుంటే అందరు బాగుంటారని అన్నారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజవర్గం పరిధి లో చేపట్టిన 5 లీఫ్ ఇరిగేష న్లకు సంబంధించి భూసే కరణకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. రాష్ట్ర నీటిపా రుదల శాఖ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ , ఎత్తి పోతల పథకాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీ ర్లు ,అసిస్టెంట్ ఇంజనీర్లు, మిర్యా లగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, అడవిదేవులపల్లి తహసిల్దార్ తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.