Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: త్వరలో నామినేటెడ్ సందడి

–నేలాఖరులోగా నామినేటెడ్ పదవుల పందేరం
–25కిపైగా కార్పొరేషన్‌ పదవుల భర్తీ యోచనలో సీఎం రేవంత్‌
–సిఎం అమెరికా నుంచి తిరిగి రాగానే ఢిల్లీలో మంతనాలు
–టీపీసీసీ చీఫ్‌ ఎంపిక, నామినేటెడ్‌ అంశాలకు లైన్‌క్లియర్‌ అవకాశం

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలకు మరోసారి పదవుల పందేరం (Fifteen positions) చేసేందుకు రంగం సిద్ధమవు తోంది. రెండో దఫా నామినేటెడ్‌ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)దృష్టిపెట్టినట్టు తెలి సింది. ఇంతకుముందు 36 కార్పొ రేషన్లకు చైర్మన్లను నియమించగా ఈసారి మరో 25కుపైగా పోస్టులను నింపే యోచనలో ఉన్నట్టు సమా చారం. సీఎం రేవంత్‌ అమెరికా, దక్షి ణ కొరియాల పర్యటన పూర్తి చేసుకున్న వెంటనే ఢిల్లీలో మకాం వేసి ఈ విషయంపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికతో పాటు నామినే టెడ్‌ పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అవుతుందని.. ఈ నెలాఖరులోపే నామినేటెడ్‌ పదవుల జాబితా వెలువడుతుందని వెల్లడిస్తున్నా యి. ఇదిలా ఉండగా తొలి దఫాలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షు లు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు (Tickets for Presidential and Assembly elections) దక్కనివారు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు కలిపి 36 మందికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు అప్పగించారు. ఆ జాబితాలో చోటుదక్కని చాలా మంది మలి జాబితా కోసం ఎదు రుచూస్తున్నారు.

చాలా కాలం నుంచీ పార్టీలో పనిచేస్తున్నవారు, విద్యార్థి నాయకులు, అధికార ప్రతినిధులుగా (Workers, student leaders, representatives)పనిచేస్తున్నవారు, మహిళా నేతలతోపాటు కొందరు సీనియర్లు కూడా పదవులు ఆశిస్తు న్నారు. నెల రోజుల క్రితమే రెండో దఫా పదవుల పందేరం ఉంటుం దనే చర్చ జరిగినా ఆ దిశగా అడుగులు పడలేదు. పార్టీ అధికారం లోకి వచ్చి ఏడాది దగ్గరపడు తోందని, వీలైనంత త్వరగా పదవులు ఇవ్వాలని ఆశావహులు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే రెండో రౌండ్‌ నామినేటెడ్‌ పదవుల జాబితాలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కీలక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కనున్నట్టు చర్చ జరుగుతోంది.

ఆర్టీసీ, సివిల్‌ సప్‌లైస్, మూసీ రివర్‌ఫ్రంట్‌ (RTC, Civil Supplies, Musi Riverfront)వంటి ముఖ్యమైన కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు అప్పగిస్తారని.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గంలో స్థానం దక్కనివారికి చైర్మన్‌ పదవుల తోపాటు కేబినెట్‌ హోదా కల్పిస్తా రని సమాచారం. ఇక బేవరేజెస్‌ కార్పొరేషన్, వైద్య మౌలిక సదుపా యాల కల్పన, హ్యాండ్లూమ్స్, గీత కార్పొరేషన్‌ తదితర పోస్టులు కూడా ముఖ్య నేతలకు అప్పగిం చనున్నట్టు తెలిసింది. వీటితోపాటు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు కూడా ఈసారి చైర్మన్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వైశ్య కార్పొరేషన్‌కు మాత్రమే చైర్మన్‌ను ప్రకటించగా మిగతా కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించాలని టీపీసీసీ నాయ కత్వంపై (TPCC leadership)ఒత్తిడులు వస్తున్నాయి.