Gas cylinder: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ (Gas cylinder)ధరలను తగ్గించే ప్రత్నయం ఎప్పటికి అప్పడూ చేస్తూనే ఉంటుంది . ఈ క్రమంలో ఎన్నికల ముందు మోడీ సర్కార్ గ్యాస్ సిలిండర్ (Gas cylinder)ధరలను భారీగా తగ్గించిన విషయం అందరికి తెలిసిందే . అయితే తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ఎల్‌పీజీ సిలిండర్లకు సంబంధించిందే. అలాగే రాష్ట్ర మహిళలు దీని నుండి ప్రత్యక్ష ప్రయోజనం పొందబోతున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం లాడ్లీ బహనా యోజన కింద 450 రూపాయలకు ఎల్‌పిజి సిలిండర్లను (LPG cylinders) అందించనున్నట్లు తెలియచేసారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్న 40 లక్షల మంది లాడ్లీ బహన్‌లకు, నాన్‌పిఎంయువైకి రూ. 450 చొప్పున డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) తెలిపారు. రక్షాబంధన్ పండుగను దృష్టిలో పెట్టుకొని బహనా యోజనకు రూ.1,250 సాధారణ సహాయంతో పాటు అదనంగా రూ.250 ఇవ్వనట్టు సమాచారం.
గత ఏడాది రక్షాబంధన్ (Raksha Bandhan) సందర్భంగా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్‌లో ఎల్‌పిజి వినియోగదారులందరికీ (33 కోట్ల కనెక్షన్లు) పెద్ద బహుమతిని ఇచ్చిన సంగతి అందరికి విదితమే. దీని కింద ఎల్‌పీజీ సిలిండర్‌పై ఒక్కో సిలిండర్‌పై (Gas cylinder) రూ.200 తగ్గింది. ఈ నిర్ణయం తర్వాత ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర సిలిండర్‌పై రూ.1103 నుంచి రూ.903కి వరుకు తగ్గింది.
అనంతరం మార్చి 8, 2024న, మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ (LPG cylinders)ధర రూ.803కి తగ్గింది. అదే సమయంలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు 300 రూపాయల సబ్సిడీ కూడా లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో పథకం లబ్ధిదారులు ఇప్పుడు 503 రూపాయలకు సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే రక్షా బంధన్ (Raksha Bandhan) సందర్భంగా ఇలాంటి ప్రకటనలు ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుండని వినియోగదారులు వాపోతున్నారు.