నల్లబండగూడెంలో ఫీవర్ సర్వే
Fever survey:ప్రజా దీవెన, కోదాడ: అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Primary Health Centre)పరిధిలోని నల్ల బండ గూడెం గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వైద్యాధికారి ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించి జ్వరాలతో (fever) ఉన్న రోగులను గుర్తించి రక్త నమూనాలను సేకరించి చికిత్స అందించారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ కుమార్ (Ranjith Kumar) మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతను తెలియజేస్తూ దోమలు పుట్టకుండా ,దోమలు కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆరోగ్య విద్యను అందించారు కార్యక్రమంలో హెచ్ ఈ వో ఉపేందర్, పీహెచ్ఎన్ అనంత లక్ష్మి, సూపర్వైజర్ ఉమామహేశ్వరి, యాతాకుల మధుబాబు, నరసింహ,పరమేశ్వరి,గోపమ్మ ,గ్రామ కార్యదర్శి మరియు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు