Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kancharla Bhupal Reddy: డిస్ట్రిబ్యూటరీలకు సాగునీరు విడుదల

–నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్
— నల్లగొండ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ

Kancharla Bhupal Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డ నియోజకవర్గం పరిధిలోని డిస్ట్రిబ్యూటర్లన్నింటికీ (distribu tors) వెంటనే విడుదల చేయాలని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy)డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి (Narayana Reddy_నాయకు లు, కార్యకర్తలతో కలిసి వెళ్లి విన తిపత్రం సమర్పించారు.

నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఏఎంఆర్పి కాలువ ద్వారా నల్లగొండ నియో జకవర్గానికి చెందిన కన గల్ తిప్పర్తి నల్లగొండ మాడుగుల పల్లి మండలాలకు చెందిన డి 25, డి 37, డి39,డి 40 కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయా లని కోరారు. గత సంవత్సర కాలంగా ఎమ్మార్పీ కాల్వ ద్వారా నియో జక వర్గ రైతులకు (farmers) సాగునీరు అందకపోవటంతో పంట లు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు.

సాగర్ ద్వారా ప్రస్తుతం వందల టీఎంసిల నీరు (TMCs water) వృధాగా సముద్రం పాలవుతుందని అయినప్పటికీ AMRP కాలు వల ద్వారా సాగునీరు అందించకపోవ డంతో ఇప్పటికే నారుమళ్లు పోసు కున్న రైతులు సాగునీరు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపా రు. సీజన్ కు ముందే పంపు రిపేరు చేయవలసి ఉన్న ప్రభు త్వం నిర్ల క్ష్యంతో అధికారులు అలసత్వంతో తీవ్ర జాప్యం చేసి ఆగస్టు మాసం వరకు కూడా నిరంధించలేక పో యారని విమర్శిస్తూ ఈ విషయం లో జిల్లాకు చెందిన మంత్రులు చో ద్యం చూస్తున్నారని ద్వజమెత్తారు.

స్థానిక మంత్రి విదేశాలలో కాలం గడుపుతూ మాటలతో కోటలు కడుతున్నారు కానీ చేతలు గడప దాడటంలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఏఎంఆర్పి కాల్వలకు ( AMRP cannals)నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని లేకుంటే తాము రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని ప్రభుత్వా న్ని హెచ్చ రించారు. అదేవిధంగా తమ పార్టీ హయాంలోనే ట్రయల్ రన్ నిర్వ హించిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసి అక్క డ చెరువులు నింపాలని కోరారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో సీనియర్ నాయకులు బక్క పిచ్చ య్య, మాజీ మున్సిపల్ చైర్మ న్ మందడి సైదిరెడ్డి (Saidireddy), మాజీ ఎంపీపీ లు కరీం పాషా, నారబోయిన బిక్షం, బొజ్జ వెంకన్న మాజీ జెడ్పిటిసిలు యాదగిరి, తుమ్మల లింగస్వామి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, కొండూరు సత్యనారాయణ,జమాల్ ఖాద్రి, ఎడ వల్లి సింగిల్ విండో చైర్మన్ ధోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షు లు భువనగిరి దేవేందర్, నల్గొండ, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, మెరుగు గోపి, కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, సింగం మల్లేష్, కార్యదర్శి బడుపుల శంకర్, మెండు మణిపాల్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి ధర్వేశి పురం మాజీ చైర్మన్ నల్లబోతు యాదగిరి, మాజీ సర్పంచులు మారయ్య, పందిరి జాన్ రెడ్డి రొయ్య బద్రి ఔరేసి శ్రీని వాస్, చింతల యాదగిరి దోమ లపల్లి యాదగిరి, తగుళ్ళ శీను, కొత్తపల్లి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.