Venu Swamy: వేణుస్వామి (Venu Swamy) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. గత కొన్నాళ్లుగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. ఆ మధ్య కాలంలో సమంత, నాగచైతన్య (Samantha, Naga Chaitanya) విడిపోతారని చెప్పడం.. అనంతరం వారిద్దరూ విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. అయితే సోషల్ మీడియాలో వేణుస్వామి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. దీంతో పలువురు హీరోయిన్స్ వేణుస్వామి (Venu Swamy) వద్ద ప్రత్యేక పూజల కోసం కూడా వెళ్లారు.
ఇక ఇటీవల జరిగిన నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ Engagement of Naga Chaitanya and Sobhita Dulipalla) గురించి కూడా సంచలన కామెంట్స్ చేశాడు. 2027లో చైతూ, శోభితా విడిపోతారంటూ వేణుస్వామి జోస్యం చెప్పాడు. దీంతో తాజాగా వేణు స్వామిపై తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ (Telangana Film Journalist Association Women Commission)కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా చైతన్య, శోభితా విడిపోతారంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేయడం.. అయితే సినిమా ప్రముఖుల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తోపాటు అనుబంధ సంస్థ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారదను కలిసి వేణు స్వామిపై ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి షాకిచ్చింది.
మహిళా చైర్ పర్సన్ నేరేళ్ల శారద ఈనెల 22న వేణుస్వామి వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తూ వీడియోస్ చేసిన వేణు స్వామికి (Venu Swamy)ఒక్క సారిగా ఇలా నోటీసులు రావడం షాక్ అనే చెప్పాలి. ఈ నోటీసులపై వేణు స్వామి ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. అయితే సినీ తారల పర్సనల్ విషయాల గురించి వేణు స్వామి జోస్యం చెప్పడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలోనూ పలు సినిమాల విడుదల, రాజకీయ ఫలితాలు, టాలీవుడ్ స్టార్ హీరోస్ కెరీర్, పెళ్లి గురించి చాల రకాలుగా కామెంట్స్ చేశాడు. కొద్ది రోజులవరకు సైలెంట్ అయిన వేణు స్వామి ఇటీవల చైతన్య, శోభితా నిశ్చితార్థం గురించి కామెంట్స్ చేయడంతో ఒక్క సారిగా తెలంగాణ మహిళా కమిషన్ పిర్యాదు చేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.