SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా యస్పీ (SP Sarath Chandra Pawar) ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు పక్క సమాచారముతో నల్గొండ సి.సి.ఎస్, తిప్పర్తి పోలీ సులు సంయుక్తముగా కలిసి ముఠా ను అరెస్ట్ (arrest)చేశారు. తిప్పర్తి పి.ఎస్ పరిధిలో వాహనములు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళ్లుచున్న నంబర్ గల హోండా ఆక్టివా స్కూటి పైన వెల్లుచున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచా రించగా, వారు పెద్ద సూరారం గ్రామ పరిధిలో పగటి పూట ఒక ఇంటి తాళము పగలగొట్టి దొంగతనం నేరము చేశామని అంగీకరించారు. వెంటనే వారిని మరియు స్కూటినీ తనిఖీ చేయగా ఇట్టి చోరీ నేరము లో దొరికిన బంగారు ఆభరణాలను (Gold jewelry)మరియు ఇట్టి నేరములో ఉపయో గించిన ఇనుప రాడ్డును మొదటగా స్వాధీనం చేసుకున్నారు. సదరు బంగారు ఆభరణాలను మిర్యాల గూడ లో అమ్మడానికి వెళ్ళుచు న్నామని పట్టుబడిన ఇద్దరు నేరస్థు లు తెలిపినారు. పట్టుబడిన నేర స్థులు ఇచ్చిన సమాచారం మేరకు ముఠాలోని 4గురు సభ్యులను చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామములొ మరియు మరొక నేర స్థుడిని వలిగొండలో అదుపులోనికి తీసుకోవడము జరిగినది.
పట్టుబడి న నేరస్థులను అందరిని విచారిం చగ నేరస్థులు అందరూ ఒక ముఠా గా ఏర్పడి నల్గొండ జిల్లాతో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 నేరాలు (crimes) చేసినాము అనీ ఒప్పుకున్నారు. ఇట్టి నేరాలకి సంబ ధించిన 23.53 లక్షల విలువ చేసే 31 తులాల బంగారం, వెండి ఆభరణాలు 28,000/- నగదును అలాగే ఇట్టినేరములలో ఉపయో గించిన హెూండా ఆక్టివా స్కూటి, ఒక ఇనుప రాడ్డు మరియు 4 సెల్ ఫోన్ లను స్వాధీనంచేసుకోనైనది. పైనా పట్టుబడిన నేరస్థులలో ఒక్క రూ మినహా మిగిలిన నేరస్థులు అందరూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెంది నవారు. వీరిలో గుండెబో యిన మహేశ్, గుండెబోయిన మల్లేశ్ మినహా మిగిలిన వారు అందరు పాత నేరస్థులు. వీరి పైన గతములో నల్గొండ, జనగామ మరియు రాచకొండ కమిషనరేట్ పలు పి.ఎస్ పరిధిలలో చోరీ నేరాలు కలవు. పట్టుబడిన నేరస్థులు గతములో జైలుకు (jail)వెళ్ళినా తమ బుద్ధి మార్చు కొనకపోగా తిరిగి నేరాలు చేయా లనీ నిర్ణయించుకున్నారు.
అను కున్న ప్రకారముగా నేరస్థులు వారు తయారు చేపించుకున్న ఒక ఇనుప రాడ్డు సహాయముతో గ్రామాలల్లో, పట్టణాలల్లో (illages and towns)తాళము వేసిన ఇండ్ల ను లక్ష్యంగా రాత్రి, పగలు అనీ తెడలేకుండా చోరీ నేరాలు చేస్తూ పట్టుబడినారు. పట్టుబడిన నేర స్థులు చెప్పిన వివరాల ప్రకార ముగా నల్గొండ జిల్లాలోని తిప్పర్తి, కట్టంగూరు, చిట్యాల, నార్కట్ పల్లీ, నల్గొండ 2 టౌన్ , రాచ కొండ కమిషనరేట్ (Ni Tipparthi, Kattanguru, Chityala, Narcut Pally, Nalgonda 2 Town, Racha Konda Commissionerate) పరిధిలోని రామన్న పేట్ పి.ఎస్ పరిధిలలో మొత్తం 12 నేరాలు చేసినాము అనీ తెలిపి నారు. ఇట్టి నేరాలకీ సంభదించి బంగారు వెండి ఆభరణాలు, నగదును స్వాధీన పర్చుకొనైనది. ఇట్టి ముఠా సభ్యులను పట్టుకో వడములో నల్గొండ డి.ఎస్. పి.కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ ఎమ్.జితేంధర్ రెడ్డి ఆద్వర్యములో కె. కొండల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శాలి గౌరారం, డి.రాజు ఎస్.ఐ తిప్పర్తి సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, లింగారెడ్డి, వహీద్ పాషా, రాము శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది. సహకారముతో నేరస్థులను పట్టుకోవడము జరిగినాధి. ఇట్టి నేరస్థులను పట్టుకోవడములో ప్రతిభ కనభర్చిన సిబ్బందినీ జిల్లా ఎస్.పి. ప్రత్యేకముగా అభినందించినారు.