Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: రేపు రుణమాఫీ..!

— మూడో విడత రుణమాఫీ కి రంగం సిద్ధం
— వైరా బహిరంగ సభలో నిధులు జమ చేయనున్న సీఎం రేవంత్‌
–రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్ష ల వరకు రుణాలకు వర్తింపు

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణలో రుణ మాఫీ (Loan waiver) కి ముహూర్తం ఖరారు అయ్యింది. విడతల వారి రుణమాఫీలో భాగంగా మూడో విడత కింద గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రైతుల రుణా లను ప్రభుత్వం మాఫీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ఈ మేరకు రైతుల ఖా తాల్లో నిధులు జమ చేయనున్నా రు. ఈ నెల 2వ తేదీన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. గతనెల 18న రుణమాఫీ ప్రారంభం కాగా ఇప్ప టివరకు రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కింద 17. 55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) హామీ ఇచి్చన సంగతి తెలిసిందే.

కాగా అధికారంలోకి వచ్చిన తర్వా త 2018 డిసెంబర్‌ 12 నుంచి 20 23 డిసెంబర్‌ 9వ తేదీ వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్య మంత్రి (cm) ప్రకటించిన విషయం తెలి సిందే. ఆ మేరకు రుణమాఫీని ప్రభు త్వం ప్రారంభించింది.ఈ క్రమంలోనే తాజాగా మూడో విడత రుణమాఫీ (Loan waiver) చేయనుంది. అయితే రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు, ఆ అదనపు మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిం పజేస్తామని గతంలో ప్రభుత్వం ప్రక టించింది. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసు కున్న రైతులు (farmers) ఎంతమంది ఆ అద నపు మొత్తాలను చెల్లించారు, ఇంకా ఎంతమంది చెల్లించాల్సి ఉంది, చెల్లించని వారికి ఇప్పుడు రుణమాఫీ (Loan waiver) కాకపోతే తర్వాత చేస్తా రా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ అనుమానా లన్నీ రేపటితో నివృత్తి కానున్నా యి.