Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth: రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్

— ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

CM Revanth: ప్రజా దీవె,హైద‌రాబాద్: రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా కొన సాగిన అమెరికా,కోరియాల (America, Korea) ప‌ర్య‌ట‌ న‌ను ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth)మంగళవారం హైద‌రాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌ పోర్టు (Shamshabad Airport) లో ఆయ‌న బృందానికి ప‌లు వురు మంత్రులు, కాంగ్రెస్ నేత‌లు, భారీగా అభిమానులు ఘ‌న స్వాగ‌ తం ప‌లికారు. అక్కడ నుంచి భారీ ఊరేగింపుగా రేవంత్ త‌న నివా సానికి బ‌య‌లుదేరారు.ఇది ఇలా ఉంటే ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు బృందం అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. వారం రోజుల పాటు అక్కడున్న ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇన్వేస్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రం లోని ఇండస్ట్రియల్ పాలసీని వారికి వివరించారు.


అనంతరం అక్కడి నుంచి నేరుగా దక్షిణ కొరియాలోను (South Korea) వారి పర్యటన కొనసాగింది. పర్య టనలో భాగంగా మొత్తం రూ.31 వేల కోట్ల పెట్టుబడులను తెలంగా ణకు తీసుకురావడంలో సీఎం రేవంత్ (CM Revanth) బృందం సక్సెస్ అయింది. 19 మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కూడా చేసుకోవడం శుభ పరిణామం. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి కోకాపేటలో ప్రారంభం కాబోతున్న కాగ్నిజెంట్ (Cognizant)కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నెల 5న రాష్ట్ర సర్కార్‌తో కాగ్నిజెంట్ ఎంవోయూ కుదుర్చుకుని కేవలం పది రోజుల్లోనే క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టడం విశేషం.