Supreme Court: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ఎమ్మెల్సీల నియామకంపై (Appointment of MLCs) గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు (Supreme Court) స్టే విధించింది. తదుపరి ఆదే శాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉం టుందని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృ త్వంలోని ధర్మాసనం స్పష్టం చేసిం ది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవా లు చేస్తూ బిఆర్ఎస్ నేతలు దాసో జు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను (New MLCs)నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా ధర్మాసనం నిరా కరించింది. కొత్త ఎమ్మెల్సీల(New MLCs) నియా మకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభు త్వ హక్కులు హరించినట్లు అవు తుందని వ్యాఖ్యానించింది. ఎప్ప టికప్పుడు నియామకాలు చేపట్ట డం ప్రభుత్వ విధి అని పేర్కొంది.అనంతరం పిటిషన్ పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ విక్రమ్నాథ్ (Justice Vikramnath to the Governor and State Govt), జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం నోటీ సులు జారీ చేసింది.