Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Railway Department: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన

–త్వరలో నేరుగా గోవాకు రైలు
–సికింద్రాబాద్ నుంచి వారానికి రెండు సార్లు

Railway Department: ప్రజా దీవెన, హైద‌రాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు వెళ్లాలను కొనే వారికి రైల్వే శాఖ (Railway Department) శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌ (Secunderabad) నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికిం ద్రాబాద్‌ – వాస్కోడిగామా రైలు సర్వీసు వారం రోజుల్లో అందు బాటులోకి రానుంది. ఈ విష యాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రక టించింది. ఇప్పటివరకు సికింద్రా బాద్‌ స్టేషన్‌ నుంచి వీక్లీ సర్వీసు, కాచిగూడ నుంచి సాధారణ, ఏసీ, స్లీపర్‌ సర్వీసు గుంతకల్‌ వద్ద గోవా రైలుతో అనుసంధానంతో కొనసాగు తున్నాయి. అయితే, గోవాకు నేరుగా రైలు సర్వీసు కేటాయిం చాలని పలువురు రైల్వే శాఖను కోరారు.

దీంతో, వచ్చే వారం నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకు (Secunderabad to Goa)రైలు అందుబాటులోకి రానుంది. ప్రతి ఏటా దాదాపు గోవాను సందర్శి స్తున్న 80 లక్షల మందిలో 20 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బుధ, శుక్ర వారాల్లో సికింద్రాబాద్‌ నుంచి వాస్కో డిగామకు, గురు, శనివారాల్లో గోవా నుంచి సికింద్రాబాద్‌కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. రైలు ప్రయాణ సమాయాలతో పాటుగా స్టేషన్లు, టికెట్ ధరల (Stations and ticket prices)పైన అధికా రులు కసరత్తు చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే అధికారికంగా వీటి పైన ప్రకటన చేస్తామని దక్షిణ మ ధ్య రైల్వే అధికారులు వెల్లడిం చారు.