–వీడియో కాన్ఫరెన్స్ లో సిఎస్ తో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: సీజనల్ వ్యాధుల కారణంగా వచ్చే జ్వరం ,డెంగ్యూ (Fever, dengue) తదితర వ్యాధుల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో ముందు కెలుతున్నామని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి కి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతకుమారి బుధవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,సంబంధిత అధికారులతో సీజనల్ వ్యాధులు, స్వచ్ఛదనం-పచ్చధనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమీక్ష సందర్భంగా జిల్లా వివరాలను జిల్లా కలెక్టర్ సిఎస్ కు తెలియజేస్తూ జిల్లాలో గత నెల ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగిందని, తిరిగి ఈనెల 16 నుండి మరోసారి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు .జిల్లాలోని నల్గొండ తో పాటు, దేవరకొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల నుండి జ్వరం కేసులు వస్తున్నాయని, జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి శాంపుల్స్ కలెక్షన్ తో పాటు, టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటివరకు జిల్లాలో 214 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, బుధవారం తాను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిని సందర్శించడం జరిగిందని, బుధవారం ఆసుపత్రి లో మొత్తం 604 ఓపి కేసులకు గాను ,90 ఫీవర్ కేసులు వచ్చినట్లు గుర్తించడం జరిగిందని వెల్లడించారు. నల్గొండ మున్సిపాలిటీ తో పాటు, తిప్పర్తి, కనగల్ దామరచర్ల నుండి కేసులు వస్తున్నాయని, ముఖ్యంగా దామర చర్ల ప్రాంతంలో జ్వర కేసుల నియం త్రణకు గతంలో ఒకసారి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఇప్పుడు సైతం మరోసారి ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని శాఖలను కలుపుకొని జ్వర నియంత్రణకు కృషి చేస్తామని ఆయన వివరించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ,ప్రజల్లో ఈ వ్యాధులపై అవగాహన తీసుకురావాలని, వ్యాధులకు గురైన వారికి తక్షణ చికిత్స అందించాలని, దోమల నివారణ చర్యలను చేపట్టాలని, ముఖ్యంగా వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే అంశంపై ఎక్కువ దృష్టి సారించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను జిల్లా సీనియర్ అధికారులు సందర్శించాలని, జ్వరాలపై విద్యార్థులను, యాజమాన్యాలను అప్రమత్తం చేయాలని, ఎక్కడైనా అనుమానిత కేసులు ఉన్నట్లయితే తక్షణమే పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని ఆదేశించారు.
దోమల నివారణకు ప్రతి ఒక్కరు దోమతెరలు , దోమల నివారణ చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశంపై జిల్లా కలెక్టర్లు కూలంక షంగా సమీక్షించాలని, అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్ల లోని విద్యార్థులకు ఇచ్చే భోజనం, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారిం చాల్సిందిగా ఆదేశించారు.సీజ నల్ వ్యాధులు, జ్వర కేసులకు (fever)సంబంధించి ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులపై తో సమీక్ష లు నిర్వహించాల ని ,ప్రజలకు మెరుగైన సేవలందించే విషయంపై దృష్టి సారించాల్సిందిగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, ప్రైవేటు ఆసుపత్రులను కోరాలని అన్నారు. రానున్న వారం రోజుల పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులను జిల్లా కలెక్టర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. అంతేకాక ఎప్పటి కప్పుడు ఈ రెండు అంశా లపై నివేదికను పంపిం చాలని, ప్రజల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసు కోవాలని, ప్రజలకు తక్షణ వైద్య సహాయం అందించినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆమె అన్నారు.స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం కింద మిగిలిపోయిన మొక్కలు నాటే లక్ష్యాన్ని తక్షణమే పూర్తి చేయాలని, వీధి కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడేందుకు స్టెరిలైజేషన్ పై దృష్టి సారించాలని , స్వచ్ఛదనం- పచ్చ చదనం కార్యక్రమం నిరంతరం కొనసాగే ప్రక్రియ ఆని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ (video conference)అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడుతూ జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, అన్ని గ్రామపంచాయతీలు, మున్సి పాలిటీలలో గడ్డి కోత యంత్రాలను కొనుగోలు చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని ఎవరు దోమల బారిన పడకుండా అవగాహన కల్పించాలని అన్నారు.అదేవిధంగా స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం కింద మిగిలిపోయిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారంలో పూర్తి చేయాల్సిందిగా ఆయన ఆదేశిం చారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, డి ఎఫ్ ఓ రాజశేఖర్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫోట్ల శ్రీనివాస్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిపిఓ మురళి మున్సిప ల్ కమిషనర్ ఇతర అధికారులు, జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.