Rachakonda Police Commissioner: ప్రజా దీవెన, హైదరాబాద్: రాచకొం డ కమిషనర్ గా (Rachakonda Police Commissioner) బాధ్యతలు చేపట్టి న అనంతరం సీపీ సుధీర్ బాబు కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథాలో శాంతి భద్రతల పరిరక్షణ (Maintenance of law and order) చర్యలు తీసు కుంటున్నారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మ కం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శక త్వం చేస్తున్నారు. ఇందులో భాగం గా క్షేత్ర స్ధాయిలో విధులు నిర్వర్తి స్తున్న సిబ్బందికి ప్రేరణ కలిగించేలా కమిషనర్ బుధవారం స్వయంగా ఎల్బి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పర్య టించారు. విధుల్లో ఉన్న సిబ్బంది తో మాట్లాడి ప్రజల తో మమేకమై పని చేయాలనీవారి తో స్నేహపూ ర్వకంగా వ్యవహరించాలని సూ చించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు.
పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. రాచకొండ (Rachakonda)పరిథిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని వేళలా పోలీ సు అధికారులు, సిబ్బంది నిబద్ధత తో పని చేస్తున్నారని, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా నిర్భయంగా డయల్ 100 మరియు 112 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా పోలీ సులకు ఫిర్యాధు చేయవచ్చని తెలి పారు. మహిళా రక్షణ కోసం షిటీ మ్స్ బృందాలు అన్ని ప్రాంతాల్లో విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, డీసీపీ ఎస్ఓటీ మురళీధర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
