Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandra Babu: నిన్న ప్రజాదర్బార్ లో విన్నపం.. నేడు సిఎం చేతులమీదుగా ప్రోత్సాహకం

–అమెరికా యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కు ఎంపికైన రాష్ట్ర బాలికలు
–ప్రతిభావంతులైన విద్యార్థినులకు మంత్రి లోకేష్ చేయూత
–లక్ష చొప్పున ఆర్థిక సాయం, ల్యాప్ ట్యాప్ ల అందజేత

Chandra Babu: ప్రజా దీవెన,అమరావతి: ప్రతిభకు పేదరికం అడ్డుకారాదన్నది రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధాంతం. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాదర్బార్ ద్వారా తమవద్దకు వచ్చే ఎంతోమంది పేద విద్యార్థులకు మంత్రి లోకేష్(lokesh) ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా అగ్రదేశం అమెరికాలో యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కు ఎంపికైన ఇద్దరు ప్రతిభావంతులైన బాలికలకు లోకేష్ ఆర్థిక చేయూతనిచ్చి అండగా నిలిచారు. ఆ బాలికలిద్దరికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandra Babu)చేతులమీదుగా రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు ల్యాప్ ట్యాప్ లను అందజేశారు. ఈడ్పుగల్లులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల ఐఐటి, మెడికల్ అకాడమీలో జంగారెడ్డిగూడెంకు చెందిన బందిల సూర్య తేజశ్రీ, రాజమండ్రికి చెందిన నత్తా ప్రదీప్తి ఇంటర్మీడియట్ చదువుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో సంస్క్కృతి, సాంప్రదాయాలపై అమెరికాలో ఏడాదిపాటు నిర్వహించే స్టడీ టూర్ కోసం యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కోసం వేలాదిమంది పోటీపడగా, దేశవ్యాప్తంగా కేవలం 30మంది మాత్రమే ఎంపికయ్యారు. అందులో రాష్ట్రం తరపున తేజశ్రీ, ప్రదీప్తి ఎంపికయ్యారు. తేజశ్రీ మిచిగాన్ స్టేట్ (Tejashree Michigan State)హోప్కిన్స్ కు, ప్రదీప్తి కాలిఫోర్నియాలోని మెరిడియన్ లో యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కు ఎంపికయ్యారు. పేద కుటుంబానికి చెందిన తమ కుమార్తెకు ఆర్ధిక సాయం అందించాలని నిన్న ప్రజా దర్బార్ లో తేజశ్రీ తల్లి వినతి పత్రం సమర్పించింది. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ వారిద్దరినీ బుధవారం సెక్రటేరియట్ కు పిలిపించి అభినందనలు తెలిపారు. ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చెరో లక్షరూపాయల ఆర్థిక సాయం, ల్యాప్ ట్యాప్ లను అందించారు. యూత్ ఎక్స్చేంజి కార్యక్రమం ద్వారా భారతదేశ సంస్కృతి,సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని చంద్రబాబునాయడు వారికి విజ్ఞప్తిచేశారు. ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులు ఎక్కుడున్నా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా సూర్య తేజశ్రీ, ప్రదీప్తి మాట్లాడుతూ… ఐఎఎస్ చదివి దేశానికి సేవలందించాలన్నది తమ లక్ష్యమని అన్నారు. విజనరీ లీడర్లు చంద్రబాబు, లోకేష్ ల ను స్పూర్తిగా తీసుకొని లక్ష్యసాధన కోసం తాము ముందుకు సాగుతామని చెప్పారు. తమ ఆర్థిక పరిస్థితి గమనించి చేయూతనిచ్చిన మంత్రి లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.