Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Padmavathi Reddy: క్రైస్తవుల సంక్షేమానికి కృషి.

యేసయ్య దీవెనలు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

MLA Padmavathi Reddy:ప్రజా దీవెన, కోదాడ: దేశ ప్రజల రక్షణకు, దేశ అభివృద్ధి (For the protection of the people of the country, the development of the country)కొరకు ప్రభు ఏసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు జరపడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి (MLA Padmavathi Reddy) అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో గల బాప్టిస్ట్ చర్చిలో (Baptist Church) పాస్టర్స్ ఫెలోషిప్ నియోజకవర్గా అధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ డాక్టర్ యేసయ్య (Dr. Isaiah) ఆధ్వర్యంలో నిర్వహించిన మహా స్తుతి యాగము సువార్త సభను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రభువును వేడుకున్నారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. అనంతరం  కేక్ కట్ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగీకులు బిషప్ సిహెచ్ సల్మాన్ రాజ్, పిసిసి డెలికేట్ నెంబర్ చింతకుంట్ల.లక్ష్మీనారాయణ రెడ్డి, మహబూబ్ జానీ,రామినేని. శ్రీనివాసరావు, బాల్ రెడ్డి, గంధం పాండు, పాస్టర్లు లూకా కుమార్, అబ్రహం, ప్రభుదాసు, రాజేష్, డాకూరి తదితరులు పాల్గొన్నారు…