Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Enumula Revant Reddy: చెప్పింది చెప్పినట్లే చేసి చూపించాం…!

–రుణమాఫీ పై ఛాలెంజ్ చేసినోళ్ళు ఇప్పుడేమి చేస్తారో చెప్పండి
–ఏమాత్రం సిగ్గు, శరమున్నా హరీశ్ రావు రాజీనామా చేయాలి
–ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు మేంసిద్ధమే, మరి మీలో ఎవరొస్తా రు
–రాష్ట్రాన్ని గోదావరి, కృష్ణా జలాల తో సస్యశ్యామలం చేస్తాం
–4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని త్వరలో ప్రారంభిస్తాం
–ప్రజలు అండగా నిలిస్తే బీఆర్‌ఎ స్‌, బీజేపీలను భూస్థాపితం చేద్దాం
–వైరా బహిరంగ సభలో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

Enumula Revant Reddy: ప్రజా దీవెన, ఖమ్మం: రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విము క్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తు న్నారని, లోక్‌సభ ఎన్నికల సమ యంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగ స్టు 15 నాటికి రూ.2 లక్షల రుణ మాఫీ చేసి చూపుతామని మేం చెబితే చేయలేరని మాజీ మంత్రి హరీ శ్‌రావు (Harish Rao)సవాల్‌ చేశా డని మేము మాట నిలబెట్టుకుంటే రాజీనామా చేస్తానని చెప్పిండు, ఇప్పుడు మేం పూర్తిగా మాఫీ చేశాం వెంటనే హరీ శ్‌ రాజీనామా చేయా లని సీఎం రేవంత్‌రెడ్డి (Enumula Revant Reddy)డిమాండ్‌ చేశారు. సిగ్గు, శరం లేకుండా విమ ర్శలు చేస్తున్న హరీశ్‌ చీము, నెత్తు రు ఉంటే రాజీనామా చేయాలన్నా రు. సిద్దిపేటలో మళ్లీ ఎలా గెలుస్తా డో చూస్తామన్నారు. రాజీనామా చేయకపోతే ఏట్లో దూకాలని అప్పు డు సిద్దిపేటకు పట్టిన చీడ, పీడ వదులుతుందని రేవంత్‌రెడ్డి అన్నా రు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీల ను బొందపెట్టడం ఖాయమని ఆ సంగతి తాను చూసుకుంటానని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సీతారామ పంప్‌హౌజ్‌ మోటార్ల (Sitarama Pumphouse Motors) ప్రారంభోత్స వం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా లో గురువారం సాగుకు జీవం, రైతు కు ఊతం బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు భ ద్రాద్రి జిల్లా పూసు గూడెంలో సీతా రామ పంప్‌హౌజ్‌ను ఆయన ప్రారం భించారు. వైరాలో మాట్లాడుతూ ఈ సభలో మొత్తం 2 లక్షలలోపు రుణాలున్న రైతులకు రూ.31 వేల కోట్లు మాఫీ చేసినట్లు ప్రకటించారు. కృష్ణా, గోదావరి జలాలతో రాష్ట్రా న్ని సస్యశ్యామలం చేస్తామని ప్రక టించారు. సీతారామ ప్రాజెక్టుకు ఎన్నివేల కోట్లయినా ఖర్చుపెట్టి 20 26 ఆగస్టు 15 నాటికి పూర్తి ఆయక ట్టుకు నీరందిస్తామని చెప్పారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందని, తా ము అసెంబ్లీ నియోజకవర్గానికి 3,5 00 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తా మని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలన, కాంగ్రెస్‌ పాలనలో సాగునీటి ప్రాజె క్టులు, వ్యయాలపై బహిరంగ చర్చ కు సిద్ధంగా ఉన్నామని, డిప్యూటీ సీఎం భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ వస్తారని, బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌, బిల్లా, (Deputy CM Bhatti and Irrigation Minister Uttam will come, KCR and Billa from BRS.) రంగాల్లో ఎవ రు వస్తారో తేల్చుకోవాలని సవాల్‌ చేశారు. ఏ చౌరస్తాలోనైనా, ఏ సెంట ర్‌లోనైనా చర్చకు సిద్ధమని పేర్కొ న్నారు. జూలై 18 నుంచి కేవలం 27 రోజుల్లో రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ 8 నెలల్లోనే నెరవేర్చామని వివరించారు. బీఆ ర్‌ఎస్‌ దివాళా తీసి బస్టాండ్లలో అడుక్కుతినే స్థాయికి వచ్చినా ఇం కా మారలేదని ధ్వజమెత్తారు. ప్రజ లనే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అబ ద్ధాలు, అసత్యాలతో తిరుగుతున్న బిల్లా రంగాలు అవాకులు చవాకు లు పేలుతున్నారని, 17 ఎంపీ స్థా నాల్లో ఓడిపోయి, ఏడుచోట్ల డిపా జిట్లు రాని బీఆర్‌ఎస్‌ను (brs)బంగాళా ఖాతంలో బొందపెడదామని పిలు పునిచ్చారు. సర్వాధికారం చెలా యించినవారు నేడు ఫామ్‌హౌజ్‌ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. వారిపై సానుభూతి చూపితే కాల నాగులకు పాలుపోసి నట్లే అవుతుందని వ్యాఖ్యానించా రు.

ఈయనకు దడవం.. ఆయనకు అదరం బీజేపీని (bjp) 8 లోక్‌సభ స్థానా ల్లో గెలిపిస్తే కేంద్ర బడ్జెట్‌లో తెలంగా ణకు గాడిద గుడ్డు ఇచ్చిందని, ఆ పార్టీని కూడా ప్రజలు బొంద పెట్టడం ఖాయమని, ఈయన కేసీఆర్‌కు దడవమని, ఆయన మోదీకి అద రమని కుండ బద్దలు కొట్టారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలేసి జైలుకు (jail) పంపిన, చంటి బిడ్డల తల్లు లపై కర్కశంగా పోలీసులతో దాడు లు చేయించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ దని ద్వజమెత్తారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించేందుకు రూ.18 వేల కోట్లతో సీతారామ ప్రాజె క్టుకు రూపకల్పన చేస్తే రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎక రానికి కూడా నీరందించలేక పోయా రు. మేం 2026 ఆగస్టు 15 నాటికి పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు నీరం దిస్తామన్నారు. నెల జీతాలు చెల్లిం చలేని దుస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టె క్కించే ప్రయత్నం చేశామని, 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు కల్పిం చామని, డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, గ్రూప్‌–1, 2, 3, ఇతర నియామకాల ద్వారా ఈ ఏడాది 65 వేల ఉద్యోగా లు కల్పించబోతున్నామని రేవంత్‌ పేర్కొన్నారు.

హరీశ్‌ అభినందించకున్నా అవమానించకు…

బీఆర్‌ఎస్‌(brs) వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న తమను హరీశ్‌ అభి నందించకపోయినా ఫర్లేదని అవ మానించేలా మాట్లాడొద్దని సీఎం సూచించారు. ప్రాజెక్టులను 80, 60, 40, 20 శాతం పూర్తయినవిగా గుర్తించి ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. తాము ఇక్కడికి నీళ్లు చల్లుకోవడానికి రాలేదని, గోదావరి తల్లే తమను నీటితో తడుపుతోందని అన్నారు. హరీశ్‌ అవసరమైతే సీతారామ జలాలను చల్లుకోవాలని సూచిం చారు. రాలేకపోతే రెండు సీసాల్లో కేసీఆర్‌, హరీశ్‌కు పంపాలని మంత్రి తుమ్మలకు సూచించారు. ఆ నీటిని ఎలా కలుకొపుంటారో వారికి తెలు సునని ఎద్దేవా చేశారు. సీతారామ లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 40 శాతం పనులే జరిగాయని, ఎకరానికి కూడా నీరు ఇవ్వలేద న్నారు. రూ.10 వేల కోట్ల పని ఉం డగా 90 శాతం పనులు పూర్తయి నట్లు ఎలా చెబుతున్నారని హరీ శ్‌ను సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏనాడూ నీళ్ల కోసం రోడ్డెక్కని మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియలు ఇప్పుడు ధర్నాలు చేయడం చూ స్తుంటే తమ ప్రభుత్వం తప్పకుండా నీళ్లిస్తుందనే నమ్మకం ప్రజల్లో కలు గుతుందన్నారు.

ఖమ్మం రైతులకు (Khammam farmers)ఇబ్బంది ఉండదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్‌ కుటుంబం ఆగం చేసిందని, ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో కమీ షన్లు దండుకున్నారని సీఎం రేవం త్‌రెడ్డి ఆరోపించారు. ఈ బాగోతం బయటపడుతుందనే సీతారామకు డీపీఆర్‌ ఇవ్వలేదన్నారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ఎత్తిపోతల పంప్‌హౌజ్‌ స్విచాన్‌ చేసి నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పైలాన్‌ను ఆవిష్కరించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగా ర్జున సాగర్‌ నీరు రాకపోయినా ఖమ్మం జిల్లా ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా గోదావరి జలాలను వైరా జలాశయానికి అనుసంధానం చేశామన్నారు. ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ పనులను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగు లేటి, ఉత్తమ్‌ యుద్ధప్రాతిపధిక పూర్తి చేయించారని ప్రశంసించారు. కేసీఆర్‌ ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం నీళ్లు ఇవ్వ లేకపోయారన్నారు. నాలుగేళ్లుగా పంపుహౌస్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ (Electrical connection)ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌, హరీశ్‌ బోగస్‌ మాటలు చెప్తారు కాబట్టే ఆ పార్టీ నేతలు నీళ్ల కోసం ఆందోళన చేయలేదని ఎద్దేవా చేశారు.