–ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Gandra Satyanarayana Rao: ప్రజా దీవెన, భూపాలపల్లి టౌన్: భూపాలపల్లి పట్టణవాసుల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం 2.0 ద్వారా రూ.18.99 కోట్లతో ఓహెచ్ ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల (SR Water Tanks) నిర్మాణా నికి శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) కొబ్బరికాయ కొట్టి, శంకుస్థా పన చేశారు.ముందుగా వంద పడ కల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 1200KL సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మా ణ పనులకు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బీసీ కాలనీ గ్రీన్ ల్యాండ్ ఏరియాలో (BC colony in the Greenland area) 800KL కెపాజిటీతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం కారల్ మార్క్స్ కాలనీలో 1100KL కెపాజిటీతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ (water tank)నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే (mla) మాట్లాడుతూ రోజురో జుకు భూపాలపల్లి పట్టణం విస్తరి స్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో పట్ట ణ వాసులకు త్రాగునీటి కష్టా లను తీర్చేందుకు అమృత్ పథకం 2.0 కింద రూ.18.99 కోట్లు మం జూరు అయినట్లు తెలిపారు. సద రు నిధులతో భూపాలపల్లి పట్టణం లో మూడు చోట్ల నూతన ఓహెచ్ ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణం తో పాటు పైపులైన్ల నిర్మాణం, ఇతర పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.