Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: బిజెపిలో బిఆర్ఎస్ విలీనం ఖాయం..!.

–కేసీఆర్ గవర్నర్‌గా, కేటీఆర్‌ కేంద్ర మంత్రిగా, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఫిక్స్
–నాలుగు రాజ్యసభ సీట్లకు సమా నంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్
–మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Reddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో (bjp) మాజీ సీఎం కేసీఆర్ (kcr)సారధ్యంలోని బీఆర్ ఎస్ పార్టీ విలీనం ఖాయమని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy)పునరుద్ఘాటించారు. తెలంగాణ రా జకీయాల్లో రచ్చచేస్తున్న కాంగ్రెస్ ఆరోపణలు మరో మారు తెరమీద కొచ్చాయి. చాలాకాలంగా కొనసాగు తోన్న ఈ ఊహాగానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్య లు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ గవర్న ర్‌గా, కేటీ ఆర్‌ కేంద్రమంత్రిగా, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటా రని అన్నారు. అదే సందర్భంలో నాలుగు రాజ్యసభ సీట్లకు సమా నంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇస్తారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా హైదారాబాద్ లో హైడ్రా ద్వారా నిర్మితమైన అక్రమ నిర్మా ణాలను (Illegal constructions) కూల్చివేసే ప్రక్రియ కొన సాగుతోందని, ఎందులో ఎలాంటి రాజకీయాలూ లేవని అన్నారు.

రైతులకు రుణమాఫీ (Loan waiver for farmers) చేస్తామని హామీ ఇచ్చామని, హామీ చేసి చూపించామని అన్నారు. తాజా పర్యటనలో దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర అధిష్టానం పెద్దలను కలుస్తానని చెప్పారు. కాగా వర్గీకరణపై పార్టీ అగ్ర నాయకులు చెప్పిందే తాను చేశానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వర్గీకరణపై తాము స్టాండ్ తీసుకు న్నామని, దానికే కట్టుబడి ఉన్నామ ని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై రాజకీయంగా తనకు ఒక స్టాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నా రు. అయితే గురువారం రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీలో తాజా పరిణామాలు, నూతన పీసీసీ అధ్య క్షుడి ఎంపిక, కేబినెట్‌లో కొత్తవారికి చోటు కల్పించడం సహా పలు ము ఖ్యమైన అంశాలపై చర్చించను న్నారని సమాచారం. మరోవైపు రైతు రుణమాఫీ అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ (Revanth Reddy) వివరించనున్నారని తెలిసింది. మూడు విడతల్లో రైతు లకు రుణమాఫి చేసిన విధానానికి సంబంధించిన అంశాలను వివరిస్తా రని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.