–మాజీ మంత్రి హరీశ్ రాజీనామాకు మైనంపల్లి పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు
–నీ రాజీనామా ఏడబోయే అగ్గిపెట్ట హరీశ్ రావు అంటూ వ్యంగ్యాస్త్రా లు
Harish Rao: ప్రజా దీవెన, సికింద్రాబాద్: పంట రుణాలు మాఫీ (Crop loan waiver) చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం తో హరీశ్ రావు రాజీనామా చేయా లని సికింద్రాబాద్లో ఫ్లెక్సీలు వెలిశా యి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై (Harish Rao) ఫ్లెక్సీలు బాగోతంతో కలకలం రేకెత్తింది. రాత్రికి రాత్రే మల్కా జిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కొం దరు హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ (demand)చేశారు.దమ్ముంటే రాజీనామా చెయ్, రుణ మాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడ బోయే అగ్గిపెట్ట హరీశ్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట (Patni, Paradise, Rasulpura, Begumpet, Panjagutta) సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
ఆగ ష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులం దరికీ 2 లక్షల రుణమాఫీ (Loan waiver)సంపూర్ణం గా అమలు చేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధం అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు గతంలో ప్రకటిం చిన సంగతి తెలిసిందే. ఈ సవాల్ ను గుర్తుచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లా వైరా సభలో చీము నెత్తురు, సిగ్గు శరం ఉంటే హరీశ్ తన ఎమ్మెల్యే పదవికి రా జీనామా చేయాలన్నారు. రాజీనా మా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడ అవుతుందని ధ్వజమెత్తా రు. ఒకవేళ రాజీనామా చెయ్యకపో తే అమరుల స్థూపం దగ్గర హరీష్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ (revanth) డిమాండ్ చేశారు.