–హరీష్ రావు క్యాంపు కార్యాల యంపై దాడి హేయమైన చర్య
–కాంగ్రెస్ గుండాలు స్వయంగా చేసిన దుర్మార్గo పని
–మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం
Jagadish Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభు త్వ ప్రోత్సాహంతోనే సిద్దిపేటలో కాంగ్రెస్ గుండాల దాడి జరిగిందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy)ఆరోపించారు. హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై (Harish Rao Camp Office) దాడి హేయమైన చర్యగా ఆయన అభి వర్ణించారు. కాంగ్రెస్ గుండాలు స్వ యంగా చేసిన దుర్మార్గo పని అం టూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం కాం గ్రెస్ గుండాలకు దగ్గరుండి దాడి చే యంచిందని, ఇటువంటి చిల్లర వే షాలకు మిము భయపడమని స్ప ష్టం చేశారు. నల్లగొండలో అయిన ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మాట్లాడారు. ఎంతో మంది రాక్షసులను తరిమికొట్టినామని, కేసీఆర్ ముందు ఇవి ఏవి నడ వవని కేసీ ఆర్ శిఖరం లాంటి వార ని గుర్తు చేశారు. రుణమాఫీ (loan waiver) విష యంలో అన్నదాతలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ వి షయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలు పెట్టిందని మే ము అహింస పద్ధతుల్లో ఉద్యమం నడిపామని గుర్తు చేశారు. తెలంగా ణ ఉద్యమంలో హింసలేని ఉద్య మాన్ని అణిచివేయలని ఎన్నో కుట్ర లు చేశారు అప్పట్లో ఇవ్వాళ రుణ మాఫీ విషయంలో రైతులను న మ్మించి గొంతు కోశారని, కాంగ్రెస్ వా ళ్లు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రూ.
2 లక్షల రుణమాఫీ (loan waiver) చేస్తామని మాటిచ్చారని, మొద ట రూ.49 వెల కోట్లతో చేస్తామన్నా రు, 50 లక్షల మంది రైతులు అన్నా రు, ఆ తర్వాత రూ. 31వెల కోట్లు అని క్యాబినెట్ లో చెప్పారు, ఆత ర్వాత రూ. 27 వేల కోట్లు అని చె ప్పారు అవి అన్ని మాట తప్పి ఇవ్వాళ రూ. 17 వెల కోట్లు ఇచ్చి సగం మంది రైతులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. ఇవ్వాళ రైతులు తిరగబడుతు న్నారని, కాబట్టి సీఎం రేవంత్ చిల్ల ర మాటలు మాట్లాడుతున్నాడని ద్వజమెత్తారు. కావాలని ప్రజలను పక్కదారి పట్టించేలా సీఎం రేవంత్ ప్రయత్నం ఇది అంతా రైతులారా ఒక్కసారి ఆలోచన చేయాలని కాం గ్రెస్ మిమ్ములను దాగా చేస్తుందని, మోసం చేసిందని గుర్తు చేసింది.
రేవంత్ రెడ్డి అనే టోడు బీజేపీ (bjp)తో దొంగ సంభదాలు పెట్టుకున్నాడని, రేవంత్ బీజేపీ తో కుమ్మక్కు అ య్యాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ (revanth) ఆంటోడు అల్పజీవని, పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని, పి చ్చి పిచ్చి మాటలు మాట్లాడుతు న్నాడని,నువ్వు దొంగ లాగా బీజేపీ తో మిలాఖత్ అయ్యావని, మేము కాదని స్పష్టం చేశారు. సమస్యను పక్కదారి పట్టించుడులో రేవంత్ సిద్ధహస్తుడని, రాష్ట్రంలో హింస ప్రేరేపించాలని రేవంత్ ప్రయత్నం చేస్తోండని, కాంగ్రెస్ చేసిన రుణమా ఫీ భయంకరమైన మోసం, పచ్చి అ బద్ధo, అన్నదాతలను దొంగల్లాగా క్రియేట్ చేస్తున్నారని, కాంగ్రెస్ నా యకులు అన్నదాతలు మాదిరిగా ఆవేదన పడుతున్నారని, రుణాలు ఇచ్చేటప్పుడే అన్ని పత్రాలు సరి చూసుకునే రుణాలు ఇస్తారని, మరి ఇప్పుడు ఇన్ని కొర్రీలు పెట్టి రైతు లను ఎడిపిస్తున్నారు ఎందుకు అని ప్రశ్నించారు. ఇవ్వాళ రుణమాఫీ ఎగ్గొట్టేందుకు అన్నదాతలను దొంగ ల్లాగా క్రియేట్ చేస్తున్నదని, ఈ ప్రభు త్వం, ఇంతకు మించిన ద్రోహం ఇంకోకటి ఉండదని, రైతుల్లారా అర్థం చేసుకోండని కోరారు.
కాంగ్రెస్ మోసాన్ని గ్రహించాలని, బి ఆర్ ఎస్ రైతుల తరపున కొట్లాడుతుందని, మిము అండగా ఉంటామని, ఇప్ప టికైనా రైతు భరోసా ఇవ్వాలని, అం దరికి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.గ్రామాల్లో రైతులు ఐక్యం కావాలని, కాంగ్రెస్ ప్రభు త్వంపై తిరగబడాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో అన్ని పార్టీ కార్యాలయాలు ఉన్న విధంగానే మా పార్టీ ఆఫీస్ కూడా ఉందని, అన్నిటికీ ఉన్న నిబంధనలు మాకు ఉన్నయని, అన్ని పార్టీలు లాగానే మేము కార్యకర్తల కోసం దేవాల యం లాంటి ఆఫీస్ ను కట్టుకు న్నామని, మా పార్టీ ఆఫీస్ ను కులుస్తామనడం సమంజసం కాదని హితవు పలికారు.
ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు ఎం సి కోటిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేం దర్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యు లు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ మాజీ శాసనసభ్యులు కం చర్ల భూపాల్ రెడ్డి,తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, మిర్యాలగూడ మాజీ శాస నసభ్యులు నల్లమోతు భాస్కరరా వు, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య లతో పాటు రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర సింహారెడ్డి, చీరా పంకజ్ యాద వ్,కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి,రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మున్సి పల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎస్కే కరీం పాషా, మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్,మైనం శ్రీనివా స్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువన గిరి దేవేందర్ కనగల్, నల్లగొండ, తిప్పర్తి,మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య,దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, లొడంగి గోవర్ధన్, ఎడవల్లి సింగి ల్విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి,కడారి కృష్ణయ్య బడుపుల శంకర్,వనపర్తి నాగేశ్వరరావు, పేర్ల అశోక్,బిపంగి కిరణ్, బొజ్జ సైదులు, కంచర్ల విజ యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.