*విధి నిర్వహణలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సేవలు అభినందనీయం.
*ఉత్తమ సేవలతోనే ఉద్యోగులకు మంచి గుర్తింపు.
DSP Sridhar Reddy: ప్రజా దీవెన, కోదాడ: విధి నిర్వహణలో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించిన ప్రతి ఉద్యోగికి ఎల్లవేళలా గుర్తింపు లభిస్తుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల, సీతారామయ్య (Ravella, Sitaramaiah)అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి (DSP Sridhar Reddy) ఇండియన్ పోలీస్ మేడల్ అందుకున్న సందర్భంగా శనివారం సంఘ కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి (DSP Sridhar Reddy) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి (DSP Sridhar Reddy)భారత ప్రభుత్వం తరఫున విదేశాల్లో సైతం పనిచేశారని వారు ఎక్కడ పనిచేసిన విధి నిర్వహణలో అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తారని ఆయన సేవలను (services) కొనియాడారు.
భవిష్యత్తులో వారికి మరెన్నో అవార్డులు రావాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో సైతం డీఎస్పీ శ్రీధర్ రెడ్డి (DSP Sridhar Reddy)చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, బొల్లు. రాంబాబు, గడ్డం. నరసయ్య, లక్ష్మీకాంత రెడ్డి, పొట్ట జగన్మోహన్ రావు,పోటు. రంగారావు, బిక్షం, భ్రమరాంబ , జాఫర్, రుక్ముద్దీన్ హరిబాబు, సాంబులు తదితరులు పాల్గొన్నారు.