Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srisailam Devotes: శ్రీశైలం మల్లన్న భక్తులకు తీపి కబురు

–ఈ నెల 18, 19 తేదీలో స్వామివా రి స్పర్శదర్శనాన్ని కల్పించనున్న అధికారులు

Srisailam Devotes: ప్రజా దీవెన, శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో (In Srisailam Maha Kshetra)ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనా లను నిలుపుదల చేస్తూ భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనా న్ని మాత్రమే కల్పించాలని అధికా రులు (Officials)నిర్ణయించారు. భక్తుల కోరిక మేరకు ఈ నెల 18, 19 తేదీలో స్వామివారి స్పర్శ దర్శనాన్ని కల్పిం చేందకు అధికారులు నిర్ణయించా రు.

ఈ రెండు రోజులు నిర్దిష్ట సమ యాలలో నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనం (Swami’s touching vision) కల్పిం చనున్నారు.మొదటి విడత 6:45 నుంచి 8:30 వరకు, రెండవ విడత మధ్యాహ్నం 12 నుంచి 1:30 వర కు, మూడో విడత రాత్రి 8 నుంచి 9 వరకు, నాలుగో విడత రాత్రి 10 నుంచి 11:30 గంటల వరకు స్వా మివారి స్పర్శ దర్శనం కల్పించ నున్నారు. భక్తులు స్పర్శ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్ వెబ్‌సైట్ https://ww.srisailadevasth anam.org ద్వారా గంట ముందు వరకు కూడా పొందవచ్చు. అయితే ఈ రెండు రోజులు స్వామివారి గర్భా లయ, సామూహిక ఆర్జిత అభిషేకాలు, ఆర్జిత కుంకుమా ర్చనలకు అవకాశం లేదు.