Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandra Babu: ఏపి కి కేటాయించిన నిధులు వెంటనే విడుదల

–అంశాల వారీగా ఆ విషయాలన్నీ మోదీ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబా బు
–కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటా యించిన నిధులను సత్వరం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి
–దిల్లీ పర్యటనలో రెండో రోజూ కేం ద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మ లా సీతారామన్, నడ్డాలతో సమావేశ మైన ఏపి సీఎం
–ప్రతిష్టాత్మక పోలవరం, అమరావ తి నిర్మాణ పనులు వేగిరం కోసం సాయానికి అప్పీల్
–విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమా రస్వామితో సమాలోచనలు

Chandra Babu: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి దిల్లీకి వెళ్లిన సీఎం చంద్ర బాబు (Chandra Babu) ప్రధాని మోదీతో (modi)ఆయన అ ధికారనివాసం 7-లోక్‌క ల్యాణ్‌ మా ర్గ్‌లో సుమారు గంట పాటు సమా వేశమయ్యారు. బడ్జెట్లో ఏపీకి కేటా యించిన నిధుల సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యమి స్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు.పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందు కు సహకారం అందించాలని మోదీ ని చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టుకు (Polavaram project)అవసరమైన నిధులను వచ్చే కేబినెట్‌ సమావేశంలో చర్చిం చి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయ డానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశా రు. అమరావతికి బడ్జెట్‌లో ప్రకటిం చిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనం త త్వరగా అందిస్తే రాజధాని నిర్మా ణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందన్నా రు.

ప్రత్యేక సాయాన్ని విడుదల చే యండి… ఏపీలో మౌలిక వసతు ల (Infrastructure)అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తా మని విభజన చట్టంలో చెప్పిన విష యాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర (Rayalaseema, Prakasam, Uttarandhra)జిల్లాలకు బడ్జెట్‌లో ప్రకటించిన ప్ర త్యేక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరి శ్రమలకు అనుకూలమైన వాతావ రణం కల్పించేందుకు వీలుగా పారి శ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు.

రాష్ట్ర అభివృద్ధికి సహకరించం డి: మోదీతో (modi) భేటీ అనంతరం నేరు గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్‌ కార్యాలయానికి వెళ్లిన చంద్ర బాబు ఆమెతో సుమారు గంట పా టు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చారు. విశా ఖ ఉక్కు భవిష్యత్తుపై కుమా ర స్వామితో సీఎం చర్చించారు. విశాఖ ఉక్కు ఏపీ ప్రజల భావోద్వే గాలతో ముడిపడిన అంశమని దానిలో పెట్టుబడుల ఉపసంహర ణ ప్రక్రియ ఆపేసి, సెయిల్‌లో విలీ నం చేసి లాభదాయకంగా నడిపేం దుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభి వృద్ధికి సహకరించాలని చంద్రబా బు (Chandra Babu) కోరారు.

కలిసికట్టుగా పని చేద్దాం: హోం మంత్రి అమిత్‌ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు గంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనుల గురించి మాట్లాడారు. రా ష్ట్రంలో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత మొదలు పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. కేంద్రం నుంచి తగిన చేయూతనందించా లని కోరగా అమిత్‌షా సానుకూలం గా స్పందించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ప్రజలు ఏం ఆశించి కూట మికి ఓటేశారో ఆ ఆకాంక్షలను నెర వేర్చడానికి కలిసికట్టుగా పని చేద్దా మని ఇద్దరు నాయకులు నిర్ణయిం చారు.

సానుకూలంగా స్పందించిన మోదీ: రెండు రోజుల సీఎం చంద్ర బాబు (Chandra Babu) దిల్లీ పర్యటన విజయవం తంగా సాగిందని నేతలు తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులు చంద్రబా బు ప్రతిపాదించిన అన్ని అంశాల పై, సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.