Konda Janaiah Goud: ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ పట్టణం లోని గౌడ సంఘం భవనం లో బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) 374 వ జయంతిని నకిరేకల్ కల్లు గీత పా రిశ్రామిక సహకార సంఘం అధ్యక్షు లు కొండ జానయ్య గౌడ్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రౌతు వీరబ్రహ్మం గౌడ్ (Dr. Rauthu Veerabraham Goud) హాజరై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధ ర్బంగా డాక్టర్ రౌతు వీరబ్రహ్మం గౌడ్ మాట్లాడుతూ 1650 ఆగస్టు 18న జనగామ తాలూకా ఖిలాషాపురం గ్రామంలో జన్మించి కొంత కాలం కల్లు గీత వృత్తి నిర్వహించి ఆనాటి పెత్తంధారులను, డిల్లీ మొగలు ల ను, నిజామ్ దొరలను, ఎదిరించి బహుజనులు ఏకం చేసి గోల్కొండ కోటను జేయించి పరిపాలించిన మాహా వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
పాపన్న (Papanna Goud) ఆశయ సాధనకు మనo పాటు పడాలని అందుకు అనుగు ణంగా మనం సంఘటితంగా ఉం డాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్ర మంలో సొసైటీ ఉపాధ్యక్షులు భూప తి వెంకట్ నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి చనగాని రవి గౌడ్, కోశా ధికారి కొండ యాదగిరి గౌడ్, కో ఆప్ష న్ సభ్యులు మాధగోనీ వెంకన్న గౌడ్, చౌగోని వెంకన్న గౌడ్, 10 వ వార్డ్ కౌన్సిలర్ చౌగోని లక్ష్మీ నారా యణ గౌడ్, సభ్యులు చన గాని లింగయ్య గౌడ్, సమ్మెట నగేష్ గౌడ్, చౌగోని గిరి గౌడ్, ధోరేపల్లి నాగ రాజు గౌడ్, చౌగోని శివ గౌడ్, గోపా గోని నాగరాజు గౌడ్, సమ్మెట నవీన్ కుమార్ గౌడ్, చనగాని రాజశేఖర్ గౌడ్, దండెంపల్లి యాదగిరి గౌడ్, చౌగోని శంకర్ గౌడ్, కర్నాటి నితిన్ గౌడ్, ఛనగాని నాగరాజు గౌడ్, జెరి పోతుల శంకర్ గౌడ్, కొండ ఉపేం దర్ గౌడ్, సమ్మెట ఉదయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.