–బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ఖర్మ బీజేపీకి పట్టలేదు
–కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ప్రజలను పక్కదోవ చేసేందుకే విలీ నం అంశం
–కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Bandi Sanjay: ప్రజా దీవెన, , హైదరాబాద్ : బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం (Merger of BRS in BJP) అవుతుందం టూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ వ్యవహారంపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండన్నారు. వాటితో ప్రజ లకేం సంబంధం అన్నారు. ఇదే అంశం పై ఇటీవల విపరీతమైన ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడా రు. బీఆర్ఎస్పై, ఆ పార్టీ అగ్ర నేత లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీ ఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్ల తో కొట్టే పరిస్థితి ఉందన్నారు. బీఆ ర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని బం డి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆ పా ర్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందన్నారు. అవినీతి పార్టీ బీఆర్ ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి (bjp) లేదన్నారు.
రుణమాఫీ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టి బొమ్మ లను కాల్చేస్తున్నా పట్టించుకోరా అని నిలదీశారు. రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలపై చర్చను పక్క దారి పట్టించేందుకే ఈ విలీన డ్రామాలను తెరమీదకు తీసు కువస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలని సంజయ్ ఫైర్ అయ్యారు. రుణ మాఫీపై కాంగ్రెస్ మాట (Congress’s word on loan waiver)తప్పిం దన్నారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో రూ. 40 వేల కోట్ల రుణా లను మాఫీ చేస్తామని ప్రకటించి.. బడ్జెట్లో రూ. 26 వేల కోట్లు కేటా యించి చివరకు రూ. 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా అన్నారు.