ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలి గౌరారం మండలం గురజాల జడ్పి స్కూల్ లోని 1995-96 ఎస్ఎస్ సి బ్యాచ్ విద్యార్థులు (SSC Batch Students) పూర్వ విద్యార్థు లు (students)సమ్మేళనం జరుపుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తరువాత వారు ఒకే వేదిక మీద కలుసుకోవడం తో వారి సంతోషానికి అవధులు లేవు.ఒకరిని ఒకరు ఆప్యాయత గా పలకరించుకొన్నారు.
అప్పటి స్మృతులను గ్యప్తికి తెచ్చుకొని ఆనందం వ్యక్తం చేసుకున్నారు.తమకు విద్యాబుద్దులు చెప్పిన అప్పటి హెచ్ఎం (hm) చిక్కు చంద్రమౌళి,ఉపాధ్యాయులు శాంబయ్య,మెంచు వెంకన్న,కోమటిరెడ్డి రాంరెడ్డి,రామ్మూర్తి,మారోజు వెంకన్న లను ఘనంగా సన్మానిచ్చారు.ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు వెంకటేశం,శివాజీ, ఓoకారం,నాగరాజు,శ్రీనివాస్, వెంకన్న సత్తయ్య,జ్యోతి బాస్,నర్షయ్య, గీత,సువర్ణ,జ్ఞానేశ్వరి,మమత,సునీత, జ్యోతి,హరికృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు