–కోల్ కతా వైద్య విద్యార్థిని హత్య వంటి ఘటనలు పునరావృతం కాకూడదు
–దివ్యాంగులకు కృత్రిమ అవయ వాల పంపిణీలో పెమ్మసాని
Pemmasani Chandrasekhar: ప్రజా దీవెన, గుంటూరు: విద్యార్థినిలు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదని, కోల్ కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనలు మరో సారి పునరావృతం కాకూ డదని గ్రామీణాభివృద్ధి, కమ్యూని కేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మా ట్లాడారు.గుంటూరులోని స్థానిక కమ్మ జన సేవ సమితి ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ సంయు క్త నేతృత్వంలో జరిగిన కృత్రిమ అవయవాల పంపిణీ కా ర్యక్రమంలో పెమ్మసాని (Pemmasani Chandrasekhar) ఆదివారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ ను, విద్యార్థినులను (Institution and students) ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 60 మందితో ప్రారంభమైన ఈ సేవా సమితి ప్రస్తుతం 1600 మంది విద్యార్థు లకు ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి ఒక సంస్థను ఏర్పరచాలం టే కేవలం డబ్బుతోనే కాదని కష్టం, తపన, ఆశయంతో కూడుకున్న ఆలోచన ఉన్నప్పుడే ఆచరణ సాధ్యమవుతాయని వివరించారు.చట్టసభల్లో ఒక సమర్ధవంతమైన నాయకత్వం ఉండాలన్న లక్ష్యం తోనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. విద్యార్థినులు ఎవరో చెప్పారనో, ఒత్తిడి చేశారనో తమ నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరంలేదు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసు కునేటప్పుడు తొందర పడొద్దు. మహిళలు ఎదుటి వ్యక్తులకు స్ఫూర్తిగా ఉండాలే తప్ప ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకూడదు. కోల్కతా లో జరిగిన ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు తీసుకో వాలి. నా శక్తి మేరకు ఈ రాష్ట్రానికి దేశానికి ఎంత సేవ చేయగలనో అంతా చేస్తాను.’ అని పెమ్మసాని పేర్కొన్నారు. అనంతరం చేతన ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కృత్రిమ అవయవా లను దివ్యాంగులకు పెమ్మసాని తన చేతుల మీదుగా అందజేశారు.
అనంతరం కుట్టు మిషన్లు, గ్రైండ ర్లు, తోపుడుబండ్లను (Sewing machines, grinders, toasters)అర్హులకు పెమ్మసాని పంపిణీ చేశారు. అలాగే అర్హులైన 180 మంది విద్యార్థినుల కు ఒక్కొక్కరికి రూ. 10-15 వేల చొప్పున స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేతన గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ళ రవికు మార్, బెటర్ వాషింగ్టన్, తెలుగు కల్చరల్ సంఘం ప్రెసిడెంట్ లామ్ శ్రీకృష్ణ, బ్రెజిల్ ఈ ఫౌండేషన్ ప్రోగ్రాం అడ్వైజర్ మజ్జిగ కేశవ కిషోర్ కుమా ర్, కమ్మ జన సేవా సమితి సెక్రటరీ చుక్కపల్లి రమేష్ రోటరీ క్లబ్ (Rotary Club) గుంటూరు సెంటెన్షియల్ ప్రెసి డెంట్ పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.