–4 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు
–వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తంగా 31 కమిటీల నియామకం పూర్తి
–రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మార్కె ట్ కమిటీలకు కూడా కొత్త మార్కెట్ కమిటీలను నియమిస్తాం
— వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Tummala Nageswara Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ల నియామకం ప్రక్రియ కొన సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోమవారం ప్రభుత్వం ప్రకటించిన నాలుగు మార్కెట్ కమిటీ (Four Market Committee) లతో కలిసి ఇప్పటి వరకు మొత్తంగా 31 కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించింది. తాజాగా సోమవారం మరో 4 అగ్రి కల్చర్ మార్కెట్ కమిటీలకు నూత న పాలకవర్గాన్ని నియమిస్తు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్ర స్తుత నాలుగింటితో కలిపి మొత్తం 31 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు (Agriculture Market Committee) నూతన పాలకవర్గాన్ని నియమిం చడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తెలిపారు. ఈ సందర్భంగా మం త్రి (Tummala Nageswara Rao) మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మార్కెట్ కమిటీలకు కూ డా కొత్త మార్కెట్ కమిటీలను నియ మిస్తామని వెల్లడించారు. ఇదే సంద ర్భంలో నూతనంగా ఎన్నికైన పాల కవర్గ సభ్యులకు మంత్రి అభినంద నలు తెలియచేశారు. సోమవారం నాలుగు అగ్రికల్చర్ మార్కెట్ కమి టీలకు చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లను, నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మంత్రి తుమ్మల నాగే శ్వరరావు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తం గా 31 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లకు నూతన పాలకవర్గాన్ని నియ మించడం జరిగిందన్నారు.
తాజా నియామకాలు ఉమ్మడి కరీంనగర్ (Combined Karimnagar) జిల్లాలో… రాజన్న సిరి సిల్ల జిల్లాలోని ఎల్లంతకుంట, కరీం నగర్ జిల్లాలోని గంగాధర, మానకొం డూరు, సిద్దిపేట జిల్లా బెజ్జంకి అగ్రి కల్చర్ మార్కెట్ కమిటీలకు (Agriculture Market Committee) నూ చైర్ పర్సన్ లను వైస్ చైర్ పర్సన్లతో పాటు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఎల్లంతకుంట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐరెడ్డి చైతన్య, వైస్ చైర్ పర్సన్ గా E. ప్రసాద్, గంగాధర మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా జాగీరపు రంజిత, వైస్ చైర్ పర్సన్ గా తోట కరుణాకర్, మాన కొండూ రు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మర్రి ఒడెలు, వైస్ చైర్ పర్సన్ గా రామిడి తిరుమల రెడ్డి, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పులి కృష్ణ కుమారి, వైస్ చైర్ పర్సన్ గా చిలువేరు శ్రీనివాస్ రెడ్డి నియమించడం జరిగిందని చెప్పా రు.