Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: ఎన్ హెచ్ 65 ను సురక్షిత రోడ్డుగా తీర్చిదిద్దుతాం

–17 బ్లాక్ స్పాట్ల పనులను నాణ్య త దెబ్బతినకుండా త్వరితగతిన పూర్తిచేయాలి
–రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komati Reddy Venkat Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని” మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) అధికారులకు సూచించారు. ఈ రోజు సచివాలయంలో జాతీయ రహదారులపై ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి పలు జాతీయ రహదారుల నిర్మాణాల స్థితిగతులపై ఆరాతీసి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy).. ఎన్.హెచ్-65 ని (NH-65)ఆరు లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ (DPR)ను తయా రు చేసేందుకు కన్సల్టెంట్ల నియా మకానికి ఇప్పటికే టెండర్లు పిలిచా మని త్వరితగతిన కన్సల్టెట్లను నియమించి డీపీఆర్ (DPR)సిద్ధం చేస్త మని ఆయన తెలిపారు. ఇక ఎన్.హెచ్-65 పై 422.12 కోట్ల రూపాయలతో చేపట్టిన 17 బ్లాక్ స్పాట్ల పనులను నాణ్యత దెబ్బతినకుండా త్వరితగతిన పూర్తిచేయాలని ఎన్.హెచ్.ఏ.ఐ. అధికారులకు ఆదేశించారు.

మన్నెగూడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్ పనులు (Contractor’s works) మొదలుపెట్టేందుకు అపాయింటెడ్ డేట్ ను ఈ వారంలో ఖరారు చేస్తారని తెలిపారు. పనులు మొదలు పెట్టేందుకు కొన్ని చోట్ల ఇబ్బందిగా మారిన అటవీ అనుమతులు కూడా వచ్చినందున నిర్మాణ ప్రక్రియకు ఏ ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. నాగ్ పూర్ – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున అపాయింటెడ్ డేట్ వచ్చేలోగా పెండింగ్ లో ఉన్న భూసేకరణను త్వరతిగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కావాల్సిన 1941.65 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని.. రోడ్డు నిర్మాణంలో ఇప్పటి వరకు ఇబ్బందిగా మారిన అటవీ భూముల సమస్యకు.. మహబూబాబాద్ జిల్లాలో 73.04 హెక్టార్ల భూమిని కేటాయించి పరిష్కారం చూపించామని.. మిగిలిపోయిన అతికొద్ది భూసేకరణ (Land Acquisition)కూడా సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. రైతుల భూములకు మంచి ధరలను ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని.. రైతులు అధైర్యపడకుండా భూసేకరణకు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖా ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దాసరి హరిచందన, పీడీ హైదరాబాద్ నాగేశ్వర్ రావు, పీడీ గజ్వేల్ ఎన్హెచ్ ఏఐ మధుసూధన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.