–వేడుకల్లో నిమగ్నమైన సమస్త ప్రజానీకం
–సిఎం రేవంత్, భట్టి లకు రాఖీలు కట్టిన సీతక్క, దీపాదాస్ మున్షీ
–చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
Rakhi festival:ప్రజా దీవెన, హైదరాబాద్ : రాఖీ పండుగను (Rakhi festival) రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, మట్టా రాగమయి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బండ్రు శోభా రాణి, నేరెళ్ల శారద, కాల్వ సుజాత తదితరులు సీఎం రేవంత్‌రెడ్డికి (cm revanth reddy)రాఖీ లు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు రాఖీ వేడుకలు మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీతక్క, పర్ణికారెడ్డి, మట్టా రాగ మయి రాఖీలు కట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రజాపతి బ్రహ్మకుమారీలు, మహిళా సిబ్బం ది, మహిళా పారిశుధ్య కార్మికులు రాఖీ కట్టారు.ఈ సందర్భంగా ప్రజ లకు గవర్నర్ జిష్ణుదేవవర్మ శుభా కాంక్షలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి (Shilpa Reddy) ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పైడి రాకేశిరెడ్డి, హరీశ్‌బాబు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మె ల్సీ ఎన్.రాంచందర్‌రావు తో పాటు పలువురు నాయకులకు రాఖీలు కట్టారు. బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్‌కు ములుగు జడ్పీ మాజీ చైర్పర్సన్ నాగజ్యోతి రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, థ్యాంక్యూ రేవంత్ అంకుల్ అంటూ పలువురు చిన్నారులు ఆయనకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అయితే వీరంతా వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స లు చేయించుకున్న వారు కావడం గమనార్హం. సీఎంగా రేవంత్ రెడ్డి (cm revanth reddy)) బాధ్యతలు స్వీకరించిన తరువాత.. వినికిడి సమస్యతో కొందరు పిల్లలు ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం.. చిన్నారులకు వీలైనంత త్వరగా వైద్య సాయం అందించాలని ఆదేశించారు.
ఈ మే రకు కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో (ENT Hospital) శస్త్రచికిత్సలను ప్రారంభించగా చిన్నారులకు అవసరమైన వినికిడి యంత్రాలను సైతం ప్రభుత్వమే అందించింది. అనంతరం ఏడాది పాటు ఆడిషన్స్ వెర్బల్ థెరఫీ (ఏవీటీ)ని కూడా అందించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వ ర్యంలో శస్త్ర చికిత్సలు చేయించు కున్న చిన్నారులు సచివాలయానికి వచ్చి.. సీఎం రేవంత్ కు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు ప్రధాని నరేంద్ర మోదీ (modi) ఢిల్లీలోని వివిధ పాఠశాలల విద్యా ర్థులతో కలిసి రక్షా బంధన్ వేడుక లు చేసుకున్నారు. సోమవారం ఉద యం కొందరు విద్యార్థులు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి ఆయన చేతికి రాఖీలు కట్టారు. ఆ వీడియో ను సోషల్ మీడియాలో పోస్టు చేశా రు. ఈ వీడియోలో విద్యార్థులు కుర్చీలో కూర్చున్న ప్రధాని మోదీకి రాఖీ కడుతుందగా ఆయన వారితో నవ్వుతూ ముచ్చటిస్తూ కనిపించా రు. తర్వాత వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. రక్షాబంధన్ ను పుర స్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు ‘ఎక్స్’లో శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలగాల ని ఆయన ఆకాంక్షించారు.
రాహులకు ప్రియాంక రాఖీ..
రక్షా బంధన్ సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీతో (rahul gandhi) కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు. అందులో వారి చిన్ననాటి ఫొటోలు కూడా ఉన్నా యి. ‘సోదర సోదరీమణుల మధ్య సంబంధం పూలతోట వంటిది. ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహ న, వివిధ జ్ఞాపకాలు, ఐక్యత, స్నేహం వంటివి దీనిలో వర్ధిల్లు తాయి’ అని ప్రియాంక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ రాఖీ పండుగ శు భాకాంక్షలు’ చెబుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే కూడా రక్షా బంధ న్ సందర్భంగా అందరికీ శుభాకాం క్షలు తెలిపారు.