— కుండపోగా వర్షంతో నీట మునిగిన హైదరాబాదు నగరం
–మునిగిన కార్లు, కొట్టుకెళ్లిన బైక్ లు గంటలకొద్దీ ట్రా’ ఫికర్ ‘
— విమానాశ్రయం టెర్మినల్ ను ముంచెత్తిన వరద నీరు
–నిజామాబాద్ లో వరదలో మునిగిన ఆర్టీసీ బస్సు
— భీంగల్‌లో ఏకంగా 10.6 సెం.మీ వర్షపాతం, వేర్వేరు చోట్ల పిడుగుప డి ఇద్దరి మృతి
Heavy rains:ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రధాన రోడ్లు (Main roads)ఉన్నట్టుండి చెరువుల్లా మారి పోతే, పోటెత్తుతున్న కాలువలను తలపిస్తే హైదరాబాద్ లో సోమ వారం ఇలాంటి పరిణామాలు కోకొల్లలు. నగరవ్యాప్తంగా మధ్యా హ్నం కొన్నిచోట్ల వాహనదారులకు ఇలాంటి అనుభవం ఎదురైంది. దూసుకెళ్లిన కార్లు, బైక్‌లు కుండపోత వర్షంతో (Cars and bikes in torrential rain) ముందుకు కదిలేందుకు మొరాయించాయి, కొద్దిసేపటికే వర ద పోటెత్తడంతో ఆ నీళ్లలో బైక్‌లు కొట్టుకుపోయాయి, మునిగిపోయిన కార్లలో మునిగిపోయాయి. లోపల చిక్కుకున్నవారిని స్థానికులు బయ టకు తీయాల్సి వచ్చిందంటే ఏ స్థా యిలో వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు గతంలో ఎన్నడూలేని విధంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది.సోమవారం మధ్యాహ్నం హైద రాబాద్‌లో రెండు గంటల పాటు కుండపోత వర్షం పడింది.
వరద ఉ ధృతికి టోలిచౌకీ, సికింద్రాబాద్, షేక్ పేట నాలా, యూసుఫగూద శ్రీకృ ష్ణానగర్, ఫిలింనగర్ దీనాయాళ్న (Tolichowki, Secunderabad, Sheikh Pet Nala, Yusufaguda Srikrishnanagar, Filmnagar Dinayalna) గర్ ప్రాంతాల్లో రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు వరదనీటిలో కొట్టుకు పోయాయి. టోలిచౌకీ గెలాక్సీ వద్ద వరదనీరు ముంచేయడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నీటమునిగి.. కదల్లేకపోయాయి. కొన్ని కొట్టుకు పోయాయి. కార్లు సగం దాకా మునిగి అతికష్టమ్మీద లోపలున్న వారు బయట పడ్డారు. రోడ్లపై వరద నీరు చేరడంతో పలుచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కుత్బుల్లాపూర్ వెంకన్నహిల్స్‌లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నాలాలు, మ్యాన్ హెూళ్లు పొంగి.. మురుగునీరు రోడ్లపైకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్‌పేటలో 5.3 సెం.మీ, యూసుఫగూడలో 5.2, గచ్చిబౌలిలో 5.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలుప్రాంతా ల్లో గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. సోమవారం పలు జిల్లాల్లో వర్షం పడింది. నిజామాబా ద్ రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నగరంలోని రైల్వే కమాన్ అండర్ బ్రిడ్జి వద్దకు భారీగా వరద పోటెత్తడంతో ఓ ఆర్టీసీ బస్సు నీళ్లలో చిక్కుకుపోయింది. లోపల 40మంది దాకా ఉ న్న ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ట్రాఫిక్ పోలీసులొచ్చి (police) .. స్థాని కుల సాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లాలో ని భీంగల్ లో 10.3 సెం.మీ వర్షపా తం నమోదైంది. జిల్లా పరిధిలోని మరో నాలుగు మండలాల్లో 5సెం. మీ పైచిలుకు వర్ష పాతం నమోద వ్వడం గమనార్హం. సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో 10.6 సెం.మీ, నల్లగొం డ జిల్లా గుర్రంపోడులో 9.5 సెం.మీ, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 7 సెం. మీ, ఆదిలాబాద్ జిల్లా గుడిహ త్నూర్ 5.1 సెం.మీ, సిరిసిల్ల జిల్లా గంభీర్రావు పేటలో 6.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
పిడుగులు పడటంతో రాష్ట్ర వ్యా ప్తంగా ఇద్దరు మృతిచెందారు. పొలంలో పెసరకాయ ఏరుతుండగా పిడుగుపడటంతో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సం కిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు కార్తీక్ మృతిచెందాడు. పొలానికి నీరు (water పెట్టేందుకు వెళ్లి పిడుగుపడటంతో మంచిర్యాల జిల్లా భీమిని మండలం బిట్టూ రుపల్లి గ్రామానికి చెందిన జక్కుల భాస్కర్ (56) మృతి చెందాడు.
మరో రెండ్రోజులు వర్షాలే
రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవా రాల్లో గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)సహా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నిజామాబాద్, కరీంనగర్, హన్మకొండ, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫా బాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల, నారాయణ్ పేట జిల్లాలో, ఈనెల 21న కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, గద్వాల, నారాయణ పేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురి సే అవకాశం ఉందని పేర్కొంది. ఉ రుములు, మెరుపులతో పాటు గంటలకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
సాగర్ గేట్ల మూసి వేత కృష్ణా పరిధిలో వరద తగ్గడం తో నాగార్జునసాగర్ గేట్లు మూసి వేశారు. సాగర్‌కు 14 రోజుల్లో 200 టీఎంసీల వరద వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టుకు (For Srisailam project) 96,811 క్యూసెక్కుల వరద వస్తోంది. 37,540 క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామ ర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195.21 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టమైన 45.77 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 16వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని దిగువకు వదు లుతున్నారు. గోదావరి పరిధిలోని మేడిగడ్డకు వరద ప్రవాహం కొన సాగుతోంది. 2.02 లక్షల క్యూసె క్కుల వరద వస్తుండగా అంతేనీటి ని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 3.1 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఎల్లపంల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.