–నల్లగొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి
CI Rajasekhar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ లో నిత్యం రద్దీగా కూర గాయల మార్కెట్ (Curried wound market) లో కూరగాయల వ్యాపారస్తులు రోడ్ల పై కూరగాయల బుట్టలను పెట్టి వాహణదారుల కి ఇబ్బందులు గురి చేస్తున్నారని నల్లగొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి (CI Rajasekhar Reddy) అన్నారు. స్థానికంగా నివాసం ఉండే ప్రజలు ఇబ్బందులకి గురి అవుతున్నారని వస్తున్న పిర్యాదు లని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ జిల్లా ఎస్. పి శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం బుదవారం ఉదయం నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజ శేఖర్ రెడ్డి కూరగాయల మార్కెట్ (Vegetable market) ని సిబ్బం దితో కలిసి సందర్శించి, మార్కెట్ వ్యాపారులందరితో సమావేశం ఏర్పా టు చేసి, అందరికీ అవగా హన కల్పించారు. అనంతరం రోడ్ల పై ఉన్న కూరగాయల బుట్టలను, ఇత ర సామాగ్రిని తీసివేయించి, అందరి వ్యాపారస్తుల సమక్షంలో రోడ్డు పై ఇరువైపులా ఒక వైట్ లైన్ గీయించి, దానిని దాటి ఏ వ్యాపార స్తుడు కూడా ముందుకు తమ సరు కుని పెట్టుకోకూడదని, లేనిచో షాప్ యాజమానులపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. అనంతరం, సి. సి కెమెరాల యొక్క ప్రాదాన్యత గురించి తెలియజేసి, ప్రతి షాప్ యజమాని, విధిగా సి. సి కెమెరాలు పెట్టుకోవాలని సూచించా రు.