JIO:ప్రముఖ టెలికాం సంస్థ అయినా రిలయన్స్ జియో (JIO).. టీవీ సేవలను క్రమంగా రోజు రోజుకి విస్తరణకు సిద్ధం అవుతుంది. జియో కేవలం టెలికాంకు మాత్రమే పరిమితం కాకుండా టీవీ విభాగంలోనూ ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా జియో సెట్ టాప్ బాక్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కనెన్లు తీసుకున్న వారికి సెటప్‌బాక్స్‌లో జీయో టీవీ+ యాప్స్ (Jio TV+ Apps) అందుబాటులో ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే.
అయితే ఇకపై జీయోటీవీ+ యాప్ (Jio TV+ Apps) సేవలను పొందడానికి సెటప్ బాక్స్ అవసరసం లేదు అట. ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే టీవీల్లో జియో టీవీ+ (Jio TV+ Apps) సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ జియో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందు కోసం కేవలం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే చాలు . దీంతో 800 డిజిటల్ ఛానెల్స్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది.
అన్ని స్మార్ట్‌టీవలో జియో టీవీ+ యాప్ (Jio TV+ Apps)అందుబాటులోకి రాబోతుంది. కేవలం ఛానల్స్ మాత్రమే కాకుండా ఈ యాప్‌లో జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5 వంటి ఓటీటీ (OTT like Premium, Disney+ Hotstar, Sonylive, G5) యాప్స్‌ను కూడా వాడుకోవచ్చు యూజర్స్. అయితే ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రేక్షకులు క్వాలిటీతో కూడిన కంటెంట్‌ను చూడవచ్చు.
ఇక జియో ఎయిర్ ఫైబర్ ఉపయోగించే వారు అన్ని ప్లాన్లపైనా, జియో ఫైబర్ (jio fiber) పోస్ట్‌పెయిడ్ ఉపయోగించే వారు రూ. 599, రూ. 899 ఆపై ప్లాన్లు తీసుకున్న వారు ఈ యాప్‌లో లాగిన్ అయ్యి కూడా కంటెంట్ వీక్షించవచ్చు. జియో ఫైబర్ ప్రీపెయిడ్ యూజర్లు అయితే రూ.999 లేదా అంతకంటే ఆపై ప్లాన్లు తీసుకొని ఉండాలి. అయితే సామ్‌సంగ్ టీవీ యూజర్లు ఈ యాప్‌ను ఉపయోగించుకునే అవకాశం మాత్రం కల్పించలేదు అనే చెప్పాలి. వీళ్లు కచ్చితంగా సెటప్ బాక్స్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేసుకోవాల్సిందే.