— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన నల్లగొండ:నియోజక వర్గాల వారిగాఎంపిక చేసిన ప్రత్యేక పాఠశాలల్లో గుణాత్మ క విద్య అందించడం ద్వారా ఈ సంవత్సరం పదవ తరగతి ఫలి తాలలో కనీసం 50 శాతం మంది విద్యార్థులు 10 కి 10 జీపీఎ సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) ఆదేశించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవర ణలో ఉన్న ఉదయాదీత్య భవన్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో గుణాత్మక విద్య పై జిల్లా అధికారులు,సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్లు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించాలని ,ముఖ్యంగా ఫలి తాల ఆధారంగా విద్యను అందించాలన్నారు.
ప్రైవేట్ పాఠశాలల (Private schools) మాదిరిగా ఐఐటి పై దృష్టి సారించాలని, ప్రజల భాగస్వామ్యంతో వీటి ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత ట్రెండ్ ఆధారం చేసుకుని పిల్లల్ని తీర్చిదిద్దాలని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని,ఇందుకుగాను పాఠశాలలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ,టీచర్లను ఇస్తామని చెప్పారు. వారంలోగా ప్రతి పాఠశాలలో ఒక సబ్జెక్టు టీచర్ తో 8, 9, 10 తరగతుల్లో డిజిటల్ ప్రోగ్రాం రూపొందించాలని అన్నారు. ఈ సంవత్సరం నిర్వహించే పదవ తరగతి ఫలితాల్లో ఎంపిక చేసిన ప్రత్యేక పాఠశాలల్లో కనీసం 50% పిల్లలైనా 10కి 10 జిపిఎ సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలి అన్నారు. ఎంపిక చేసిన.
ప్రత్యేక పాఠశాలల (Special schools) ద్వారా వచ్చే సంవత్సరం ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్లు ఇచ్చే విధంగా తయారు చేయాలని అన్నారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్,సైన్స్ ల్యాబులు, ఏర్పాటు చేయాలని, పెయింటింగ్ (Computer labs, science labs, set up, painting)తక్షణమే పూర్తి చేయాలని, మాడ్యులర్ కిచెన్ గ్యాస్ తో సహా ఏర్పాటు చేయాలని ,టాయిలెట్లను పూర్తిచేయాలని చెప్పారు .అవసరమైన పాఠశాలలకు ఇంగ్లీష్ టీచర్లతో పాటు, వీలైతే కేరళ టీచర్లను సైతం ఇస్తామని తెలిపారు. మంచి విద్యను అందించడం ద్వారా రానున్న 30 సంవత్సరాలు సమాజాన్ని విద్యావ్యవస్థనే తీర్చిదిద్దుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర ,జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పీడి రాజకుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రమే ష్ ,డిఈఓ బిక్షపతి, ఇతర అధికారు లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.