Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Huge explosions: అమలాపురంలో ఆగమాగం..!

–ఘోర దుర్ఘటనలో 18 మంది దుర్మరణం
–ఫార్మా కంపెనీలో భారీ పేలుళ్లతో కుప్పకూలిన కంపెనీ శ్లాబ్‌, గోడ
–ఎసెన్షియాకంపెనీలో రసాయనం లీకై ఎలక్ట్రిక్‌ ప్యానల్‌పై పడిన ద్రావ కం
–మంటలతో ‘వేపర్‌ క్లౌడ్‌ ఎక్స్‌ప్లోజ న్‌ లో కార్మికుల హాహాకారాలు
–మరణాలతో పాటు 20 మందికి పైగా తీవ్ర గాయాలు

Huge explosions: ప్రజా దీవెన, అనకాపల్లి: ఆంద్రప్రదే శ్ అనకాపల్లి ఆగమాగమై హాహాకా రాలతో అట్టుడికిపోయింది. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం అచ్యుతాపురం లో ఘోర కలి సం భవించింది. ఫార్మా సెజ్‌లో(Pharma Sez)ని ఎసెన్షి యా ఫార్మా సంస్థ లో భారీ పేలుళ్లు సంభవించాయి. బుధవారం మ ధ్యాహ్నం ఉన్నఫళంగా చెవులు దద్దరిల్లేలా భారీ పేలుడు సంభవిం చింది. ఒక్కసారిగా హాహాకారాలు ఏంజరిగిందో తెలుసుకునేలోగానే దట్టమైన పొగలు కమ్ముకొని కుప్ప కూలిన కూలిపోయిన ఫ్యాక్టరీ శ్లాబ్‌ కారణంగా భారీ ప్రాణ నష్టం సంభ వించింది. ఒకరిద్దరితో మొదలైన ప్రాణనష్టం క్షణం క్షణానికిమృతుల సంఖ్య పదుల సంఖ్యలో పెరుగు తూనే ఉంది.

ఫార్మా పరిశ్రమ చరి త్రలోనే అతి పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఇంటర్మీ డియట్‌ కెమికల్స్‌ ఉత్పత్తి ఎసెన్షి యా అ డ్వాన్స్‌డ్‌ సైన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో (Advanced Science Private Limited Company) బుధవారం మధ్యాహ్నం తొలి షిఫ్టు కార్మికులు విధులు ము గించుకుని వెళ్తుండగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కొన్ని నిమిషాల్లోనే భారీ పేలుడు సంభ వించింది. దీని తీవ్రతకు శ్లాబ్‌, గోడ కుప్పకూలిపోయాయి. ఒకదాని వెం ట మరొకటిగా జరిగిన ఘటనలతో కార్మికులు కకావికలమయ్యారు. పేలుడు ధాటికి కొందరి శరీరాలు తుత్తునీయలయ్యాయి. శ్లాబ్‌ శిథి లాల కింద కొందరు నలిగిపోయారు. దట్టమైన పొగ అలుముకోవడంతో ఎటుపోతున్నామో తెలియకుండా పరుగులు తీస్తూ గోడలకు తగిలి, మెట్లపై నుంచి కొందరు కింద పడ్డా రు.

ఈ మూడు కారణాల వల్లే భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదానికి ‘వేపర్‌ క్లౌడ్‌ ఎక్స్‌ప్లో జన్‌’ కారణమని ప్రాథమికంగా నిర్ధా రించారు. థర్డ్‌ఫ్లోర్‌లో (thirdflor) ఉన్న రియాక్ట ర్‌ నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఒక ట్యాం కర్‌లోకి ‘మిథైల్‌ టెరిషరీ బుయటైల్‌ ఈథర్‌’ అనే ద్రవ రసాయనం పంపి స్తున్నా రు. ఈ క్రమంలో పైపులు లీకై గ్రౌండ్‌ఫ్లోర్‌లోని విద్యుత్‌ ప్యాన ల్స్‌పై రసాయనం పడింది. దీంతో రసాయనం ఆవిరై దట్టమైన మే ఘాలు ఏర్పడ్డాయి. ఆ గది మొత్తం అలుముకున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్‌ ప్యానల్స్‌, ఏసీ డక్టుల ద్వారా భవనమంతా రసాయన మే ఘాలు వ్యాపించాయి. సాల్వెంట్‌ పడిన ఎలక్ట్రిక్‌ ప్యానల్స్‌ వద్ద నిప్పు రాజుకుంది. క్షణాల్లోనే దట్టమైన పొగలా అలుముకున్న రసాయన ఆవిరి వల్ల భారీ పేలుడు జరిగింది. దీని తీవ్రతకు గ్రౌండ్‌ఫ్లోర్‌ శ్లాబ్‌, గోడ కుప్పకూలాయి. మూడో ఫ్లోర్‌లో ఉన్న రియాక్టర్‌కూడా పేలిపోయిన ట్లు తెలుస్తోంది.

‘ఎసెన్షియా’లో ఒ క్కో షిఫ్టులో 80 మంది కార్మికులు పని చేస్తారు. సరిగ్గా ఏ–షిఫ్టు సి బ్బంది బయటికి వెళ్తూ బి–షిఫ్టు కార్మికులు లోపలికి వెళ్లేటప్పుడే ఈ ఘోరం జరిగింది. మరో ఐదు నిమి షాలు ఉంటే తొలి షిఫ్టు కార్మికులు మొత్తం బయటికి వచ్చేవాళ్లు. రెం డో షిఫ్టు సిబ్బంది వాహనాలు దిగి కర్మాగారం ప్రధాన గేటు దాటి వెళ్తుం డగా ఈ పేలుడు జరిగింది. దీంతో బయట ఉన్న కార్మికులు పరుగులు తీశారు. కొందరు ధైర్యం చేసి కర్మా గారంలోకి ప్రవేశించారు. క్షతగాత్రు లను అంబులెన్స్‌లు, కర్మాగారం బస్సుల్లో అచ్యుతాపురంలోని వివి ధ ప్రైవేటు ఆస్పత్రులకు తరలిం చారు. ముక్కలుగా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిన శరీరా లు ఎటు చూస్తే అటు శిథిలాలతో ప్రమాదస్థలం భీతావహంగా మారిం ది. కొందరి శరీర భాగాలు సమీపం లోని ఒక చెట్టు కొమ్మల్లోనూ చిక్కు కున్నాయి. క్షతగాత్రులు చెల్లాచెదు రుగా పడిపోయి కనిపించారు.

ప్ర మాదం సంభవించినప్పుడు ఎంత మంది కంపెనీ ఆవరణలో ఉన్నారో, వారిలో ఎందరు బయటికి వచ్చా రు, ఎందరు శిథిలాల కింద చిక్కు కున్నారనేది ఇంకా లెక్క తేలడం లేదు.రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ దట్టమైన పొగలు కమ్ముకోవడం, వాటిని పీల్చిన వారు అస్వస్థతకు గురి కావడంతో అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తప్ప ఇంకెవరూ లోపలకు వెళ్లలే కపోయారు. కంపెనీ ప్రతినిధులు కూడా గేట్లు మూసేసి లోపలికి ఎవరినీ రానీయలేదు. మధ్యాహ్నం ప్రమాదం జరిగితే రాత్రి చీకటి పడే వరకు గాయపడిన వారిని అంబు లెన్సుల్లో తరలిస్తూనే ఉన్నారు. ఎన్డీ ఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగిన తర్వాతే సహాయ చర్యలు ఊపందుకున్నా యి.