–తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
Ganji Muralidhar: ప్రజా దీవెన, నల్లగొండ: వస్త్రాలు అమ్ముడుపోక చేనేత కార్మికులకు పని లేక అప్పుల పాలై జరుగు తున్న ఆత్మహత్యలను నివారిం చడానికి ప్రభుత్వం చర్యలు చేప ట్టాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ (Ganji Muralidhar) డిమాండ్ చేశారు. గురువారం దొడ్డి కొమరయ్య భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ చండూర్ లో ఉపాధి కోల్పో యి అప్పుల పాలై ఆత్మహత్య (suicide) చేసు కున్న పులిపాటి అంజయ్య కుటుం బానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇం దిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ (Central State Govt) విధానాల వలన రాష్ట్రంలో చేనేత కార్మికులు నేసిన బట్టలకు మార్కెట్ లేక తద్వా రా కార్మికులకు ఉపాధి కోల్పోయి అప్పుల పాలై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు పది మంది ఆత్మహత్యలు చేసుకున్నా రని అన్నారు. ఆత్మహత్యల నివా రణ కోసం చేనేత కార్మికులను ఆదు కోవడం కోసం పేరుకపోయిన వస్త్రా ల నిలువలను కొనుగోలు చేయా లని చేనేత భీమా వయసుతో సంబంధం లేకుండా అందరికీ వర్తిం ప చేయాలని డిమాండ్ చేశారు. చేనేత మిత్ర ,త్రిఫ్టు పండు, చేనేత బీమా గత ప్రభుత్వం ఆపివేసిందని దాన్ని కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వచ్చిన తర్వాత ఆరుసార్లు చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కమీష నర్ శైలజ రామయ్యర్ వివిధ అధి కారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అధికారులు మంత్రులు చేనేత సంఘాలతో చర్చలు జరిపి నిధులు కేటాయించి గత పథకాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికుల ఆత్మ హత్యలు పెరుగుతున్నాయని ఆవే దన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికు ల వృత్తి రక్షణ కార్మికుల సంక్షేమం (Welfare of occupational defense workers) ఉపాధి అవకాశాల పెంపు కోసం కృషి చేయాలని లేనియెడల తెలం గాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వ ర్యంలో ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. విలేక రుల సమావేశంలో తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్త య్య, తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్య క్షుడు కందగట్ల గణేష్, గంజి నాగ రాజు, కర్నాటి శ్రీరంగం, చం డూరు పట్టణ అధ్యక్షులు తిరం దాస్ శ్రీను, తదితరులు పాల్గొ న్నారు.