CURD: చాలా మంది కూర, పచ్చళ్లతో అన్నం తిన్న తర్వాత లాస్ట్ లో ఒక పెరుగు (CURD) ముద్ద అయినా తింటారు. వారికి పెరుగుతో అన్నం తింటేనే సంపూర్ణంగా భోజనం చేసినట్లు అనిపిస్తుంది. కొంతమందికి మాత్రం పెరుగు నచ్చదు. కర్డ్ డైట్ (Curd diet)లో అస్సలు భాగం చేసుకోరు. కానీ పెరుగు తినకపోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నట్లే లెక్క. ఎందుకంటే పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ వంటి శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం.
పెరుగు తినే వారిలో కొలెస్ట్రాల్ లెవల్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ (Blood pressure )అనేది కూడా తగ్గి ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా బలోపేతం అవుతుంది. హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉన్న వారు పెరుగు తింటే ఆ సమస్యల నుంచి ఏం బయటపడవచ్చు అని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
పెరుగును రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే బరువు(weight) కూడా తగ్గవచ్చు. ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చు. ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు నుంచి బయటపడవచ్చు. ఇందులోని కాల్షియం కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ కాకపోతే బరువు పెరిగే ముప్పు కూడా తగ్గుతుంది. అలాగే డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం తగ్గుతుంది.
పెరుగులోని మంచి బ్యాక్టీరియా గట్ హెల్త్ (Bacteria in gut health)ఇంప్రూవ్ చేసి మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది. మెటబాలిజంను కూడా మెరుగు పరుస్తుంది. కర్డ్‌లోని విటమిన్ ఈ, జింక్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ (Lactic acid) ఉంటుంది. అందువల్ల దీనిని హెయిర్ కి అప్లై చేసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. పెరుగులోని న్యూట్రియంట్లు, మినరల్స్ డాండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పెరుగును హెన్నాతో కలిపి తలకు రాసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య కూడా దూరం అవుతుంది. పెరుగు వల్ల ధమనులు క్లీన్ అవుతాయి. దీనివల్ల గుండె జబ్బులు అనేవి రావు.