Weight Loss: ఊబకాయంతో (obesity)బాధపడుతున్న వారికి అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు (High blood pressure, diabetes, heart disease) వచ్చే రిస్క్ పెరుగుతుంది. బరువు తగ్గడానికి మార్గాలు అనేకం. హెల్తీ ఫుడ్ తింటూ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే వెయిట్ లాస్ కావడం సులభం అవుతుంది. వీటితోపాటు మరికొన్ని చిట్కాలను కూడా పాటిస్తే ఆరోగ్యంగా, త్వరగా బరువు తగ్గవచ్చు. వాటిలో ఒక చిట్కా ప్రకారం, పసుపు డైట్‌లో భాగం చేసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం టర్మరిక్ పౌడర్ బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
పసుపులోని కర్కుమిన్ కాంపౌండ్ నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మెటబాలిక్ సిండ్రోమ్ (Liver disease, polycystic ovary syndrome, metabolic syndrome)సమస్యలను దరిచేరనివ్వదు. ఇందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వెయిట్ లాస్ లో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వల్ల PCOS సమస్య తలెత్తుతుంది.
PCOS సమస్య వచ్చిన వారు త్వరగా బరువు పెరుగుతారు. వారు కొవ్వును ఈజీగా కరిగించుకోలేరు. అయితే హార్మోన్ల (Hormonal) పనితీరును బ్యాలెన్స్ చేయడం ద్వారా ఇలాంటి సమస్యలను పసుపు దూరం చేస్తుంది. జీర్ణక్రియ లేదా మెటబాలిజం రేటు ఎక్కువగా ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పసుపు దాని రేటును పెంచుతుంది. పసుపు వంటల్లో కలుపుకోవడం ద్వారా దీని ప్రయోజనాలు పొందవచ్చు. పాలల్లో, నిమ్మరసంలో కూడా మిక్స్ చేసి తాగవచ్చు.